ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు

మేడ్చల్ : ఎల్‌కెజి చదువుతున్న ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు దారుణంగా చితకబాదింది. దీంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌లో ఓ స్కూల్‌లో ఎల్‌కెజి చదువుతున్న ఓ చిన్నారిని పాఠశాల ఉపాధ్యాయురాలు మంజు దారుణంగా హింసించింది. దీంతో ఆ చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, పాఠశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చిన్నారి […]

మేడ్చల్ : ఎల్‌కెజి చదువుతున్న ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు దారుణంగా చితకబాదింది. దీంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు మేడ్చల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్‌లో ఓ స్కూల్‌లో ఎల్‌కెజి చదువుతున్న ఓ చిన్నారిని పాఠశాల ఉపాధ్యాయురాలు మంజు దారుణంగా హింసించింది. దీంతో ఆ చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, పాఠశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Police Complaint Against the Lady Teacher at Medchal

Related Stories: