సల్మాన్ కు షేర్ ధమ్కీ!

ముంబయి: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యుపికి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ అనే వ్యక్తి బాలీవుడ్ లో సిినిమా అవకాశాల కోసం యత్నిస్తున్నాడు. ఏంత ట్రైచేసిన చాన్స్ లు రాకపోవడంతో సల్మాన్ మేనేజర్ కు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ నెంబర్ కావాలని అడిగాడు. నంబర్ ఇవ్వడానికి మేనేజర్ తిరస్కరించాడు. దీంతో కోపొద్రిక్తుడైన ఉరఫ్ షేర్ కండల వీరుడ్ని చంపేస్తామంటూ బెదిరించాడు. అంతేకాకుండా సల్మాన్ […]

ముంబయి: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యుపికి చెందిన గులాబన్బీ ఉరఫ్ షేర్ అనే వ్యక్తి బాలీవుడ్ లో సిినిమా అవకాశాల కోసం యత్నిస్తున్నాడు. ఏంత ట్రైచేసిన చాన్స్ లు రాకపోవడంతో సల్మాన్ మేనేజర్ కు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ నెంబర్ కావాలని అడిగాడు. నంబర్ ఇవ్వడానికి మేనేజర్ తిరస్కరించాడు.

దీంతో కోపొద్రిక్తుడైన ఉరఫ్ షేర్ కండల వీరుడ్ని చంపేస్తామంటూ బెదిరించాడు. అంతేకాకుండా సల్మాన్ తండ్రికి కూడా ఫోన్ చేసి, ఫోన్ నంబర్ కావాలని వేధించాడు. అయితే, సల్మాన్ తండ్రి కూడా నంబర్ ఇవ్వకపోవడంతో అతడిని కూడా బెదిరించాడు. తను చోటా షకీల్ దగ్గర పని చేస్తుంటానని హెచ్చరించాడు. ఈ క్రమంలో సల్మాన్ తరపు నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ముంబయి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

Threats Call To Salman Khan

telangana latest news

Related Stories: