హోంగార్డుపై కానిస్టేబుల్ అఘాయిత్యం!

బెంగళూరు: స్త్రీలకు రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్… విచక్షణ మరిచి తన సహ ఉద్యోగిపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు యూనివర్శిటీలో వివాహిత అయిన ఓ మహిళా హోంగార్డుగా పని  చేస్తోంది. తనతో పాటు అక్కడే పని చేస్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ మహిళతో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలు తన షిప్ట్ ముగియడంతో రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుని, యూనిఫాం మార్చుకునే సమయంలో చంద్రశేఖర్ వచ్చి తలుపు తట్టాడు. ఆమె తన […]

బెంగళూరు: స్త్రీలకు రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్… విచక్షణ మరిచి తన సహ ఉద్యోగిపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు యూనివర్శిటీలో వివాహిత అయిన ఓ మహిళా హోంగార్డుగా పని  చేస్తోంది. తనతో పాటు అక్కడే పని చేస్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ మహిళతో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలు తన షిప్ట్ ముగియడంతో రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుని, యూనిఫాం మార్చుకునే సమయంలో చంద్రశేఖర్ వచ్చి తలుపు తట్టాడు. ఆమె తన భర్త వచ్చాడనుకుని డోర్ తీసింది. లోపలకు వచ్చిన చంద్రశేఖర్ ఆమెపై అత్యాచారం జరిపాడు. అనంతరం గదిలో కొంత డబ్బు వెదజల్లి వెళ్లిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరుకు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశామని డిసిపి చేతన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు.

Constable Arrested for Raping Woman Home Guard

telangana latest news