‘సర్కార్’వసూళ్ల సునామీ!

చెన్నై: తమిళ దళపతి విజయ్ ‘సర్కార్’తో సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ‘సర్కార్‘ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మొదట ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ‘సర్కార్’ తిరుగులేదని నిరూపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ నెలకొల్పిన రికార్డును సర్కార్ బ్రేక్ చేసింది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను […]

చెన్నై: తమిళ దళపతి విజయ్ ‘సర్కార్’తో సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ‘సర్కార్‘ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మొదట ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ‘సర్కార్’ తిరుగులేదని నిరూపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ నెలకొల్పిన రికార్డును సర్కార్ బ్రేక్ చేసింది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ ను సాధించిన ‘సర్కార్’ రెండు వారాలు గడిచేసరికి ఏకంగా రూ. 225 కోట్ల గ్రాస్ ను అందుకోవడం విశేషం. దీంతో ఈ ఏడాది దక్షిణ ఇండియాలో రెండు వారాల్లోనే అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా సర్కార్ నిలిచింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రూ. 218 కోట్ల(రెండు వారాల్లో)తో ‘రంగస్థలం’ పేరిట ఉంది. దీపావళి కానుకగా విడుదలైన ‘సర్కార్’ వసూళ్లు మూడో వారంలోనూ స్టడీగా ఉన్నాయి. దీంతో ఈ మూవీ కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 Vijay’s Sarkar Box office Collection Create a New Records

Telangana Breaking News

Related Stories: