కివీస్ సంచలన గెలుపు

తొలి టెస్టులో పాక్ ఓటమి అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ నాలుగు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక పాకిస్థాన్ ఓటమి పాలైంది. మరోవైపు ఎజాజ్ పటేల్ ఐదు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ సంచలన విజయం సాధించింది. ఎజాజ్ ధాటికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. 37/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌ను కివీస్ బౌలర్లు హడలెత్తించారు. కివీస్ బౌలర్లు […]

తొలి టెస్టులో పాక్ ఓటమి

అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ నాలుగు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక పాకిస్థాన్ ఓటమి పాలైంది. మరోవైపు ఎజాజ్ పటేల్ ఐదు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ సంచలన విజయం సాధించింది. ఎజాజ్ ధాటికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. 37/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌ను కివీస్ బౌలర్లు హడలెత్తించారు. కివీస్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు అవమానకర రీతిలో ఓటమి తప్పలేదు.

ఎజాజ్ పటేల్ చిరస్మరణీయ బౌలింగ్‌ను ప్రదర్శించడంతో కివీస్ స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడుకుని అనూహ్య విజయాన్ని అందుకుంది. సోమవారం ఆట ప్రారంభంలోనే పాకిస్థాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (10), ఇమాముల్ హక్ (27)లతో పాటు హారిస్ సోహైల్ (4)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో అజహర్ అలీ, అసద్ షఫిక్ అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఆశలు చిగురింప చేశారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే స్కోరును ముందుకు నడిపించారు. ఇద్దరు కుదురు కోవడంతో పాక్ విజయం ఖాయమనిపించింది. కానీ, కుదురుగా ఆడుతున్న అసద్ షఫిక్ (45)ను ఔట్ చేయడం ద్వారా వాగ్నర్ పాక్ పతనానికి శ్రీకారం చుట్టాడు.

తర్వాత కివీస్ బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 171 పరుగులకే కుప్పకూలించి. ఒంటరి పోరాటం చేసిన అజహర్ అలీ 136 బంతుల్లో ఐదు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 59 పరుగులకే ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో సిరీస్‌లో న్యూజిలాండ్ 10 ఆధిక్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తరచు చేతులు మారుతూ వచ్చింది. చివరికి కివీస్ అసాధారణ పోరాట పటిమతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఒక దశలో పాకిస్థాన్ అలవోక విజయం ఖాయమనిపించింది. కానీ, పట్టు వదలకుండా పోరాడిన కివీస్ చిరస్మరణ విజయం సొంతం చేసుకుంది.

New Zealand wins the first Test against Pakistan

Telangana Latest News

Related Stories: