క్రైమ్ థ్రిల్లర్

లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడగళ్’ను తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపినాథ్‌లు ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, అధర్వ, రాశీఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించగా ఆర్.అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార […]

లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడగళ్’ను తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ అధినేతలు సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపినాథ్‌లు ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, అధర్వ, రాశీఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించగా ఆర్.అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకునిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరువనున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఆర్.డి.రాజశేఖర్, ఎడిటర్‌ః భువన్ శ్రీనివాసన్.

Nayantara’s Anjali Vikramaditya Is a Crime Thriller 

Telangana News

Related Stories: