సరికొత్త యాంగిల్‌లో తేజు

సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధరమ్‌తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా […]

సాయిధరమ్‌తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రలహరి’. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధరమ్‌తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ మాట్లాడుతూ “కిషోర్ తిరుమల సినిమా అంటే క్యూట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమల ప్రజెంట్ చేస్తున్నారు”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్‌ః శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్‌ః ఏ.ఎస్.ప్రకాశ్.

Sai Dharmtej With a Different Angle in Chitralahari 

Telangana News

Related Stories: