కేంద్ర మంత్రికి కోట్ల ముడుపులు ముట్టాయి

న్యూఢిల్లీ: సిబిఐలో అధికారుల మధ్య అంతర్గత వివాదం మరింత ముదురుతోంది. సిబిఐలో ఐపిఎస్ అధికారి మనీష్ కుమార్ సిన్హా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర మంత్రి హరిభాయి పార్థీభాయి చౌదరి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరిలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై తాను జరుపుతున్న దర్యాప్తులో ఈ ముగ్గురూ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.తనను నాగపూర్ బదిలీ చేయడాన్ని రద్దు […]

న్యూఢిల్లీ: సిబిఐలో అధికారుల మధ్య అంతర్గత వివాదం మరింత ముదురుతోంది. సిబిఐలో ఐపిఎస్ అధికారి మనీష్ కుమార్ సిన్హా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర మంత్రి హరిభాయి పార్థీభాయి చౌదరి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరిలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై తాను జరుపుతున్న దర్యాప్తులో ఈ ముగ్గురూ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.తనను నాగపూర్ బదిలీ చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. సిబిఐ డైరెక్టర్ అలోక్‌వర్మను తప్పించి సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుండగా, ఆ పిటిషన్‌తో పాటుగా తన పిటిషన్‌ను విచారించాలని సిన్హా కోరారు.

అస్థానా కేసును విచారిస్తున్న బృందంనుంచి తనను తప్పించడం కోసమే నాగపూర్‌కు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఏముందని బెంచ్ ప్రశ్నించగా, తనక్లయింట్ వద్ద రాకేశ్ అస్థానాకు సంబంధించి సంచలన పత్రాలున్నాయని సిన్హా తరఫు న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ చెప్పారు.తన కక్షిదారు షాకింగ్ విషయాలను బయటపెట్టారని ఆయన చెప్పారు. అందువల్ల మంగళవారం అలోక్ వర్మ పిటిషన్‌తో పాటుగా తమ పిటిషన్‌ను కూడా అత్యవసరంగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విషయం తమను పెద్దగా షాకింగ్‌కు గురి చేయలేదని ధర్మాసనం అంటూ, అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా మనీశ్ కుమార్ ఆరోపణలపై ప్రశ్నలకు సివిసి కెవి చౌదరి స్పందించక పోగా, దోవల్ అందుబాటులో లేరు.

తన బదిలీ నిర్హేతుకమైనదే కాక ప్రేరేపితమైనదని, తన బదిలీ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 34 పేజీల పిటిషన్‌లో ఆంధ్ర ప్రదేశ్ కేడర్‌కు చెందిన సిన్హా ఆరోపించారు. అస్థానాపై కేసు నమోదు చేసినట్లు సిబిఐ డైరెక్టర్ జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌కు అక్టోబర్ 17న చెప్పారని, అదే రోజు రాత్రి ఆయన ఈ విషయాన్ని అస్థ్థానాకు చెపారని, తనను అరెస్టు చేయకుండా చూడాలని అస్థానా దోవల్‌ను కోరారని సిన్హా ఆరోపించారు. కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రికి ఏడాది జూన్ మొదటి పక్షంలో ముట్టినట్లు సిన్హా తన పిటిషన్‌లో ఆరోపించారు. అలోక్ వర్మను తప్పించిన రోజునే తనను అన్యాయంగా బదిలీ చేశారని ఆయన వాపోయారు. అలోక్‌పై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరుగుతుండగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, నవంబర్ 8న ఎపి క్యాడర్ ఐఎఎస్ అధికారిణి రేఖా రాణి నవంబర్ 8న ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన హైదరాబాద్‌కు చెందిన సతీశ్ సానా కార్యాలయంతో పదే పదే మాట్లాడడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
సతీశ్‌ను విచారించినప్పుడు గత నెల 20న తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పాడని, అదే సమయంలో కేంద్ర మంత్రిచౌదరికి ఈ ఏడాది జూన్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పాడని సిన్హా తన పిటిషన్‌లో తెలిపారు. కేంద్ర మంత్రి సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యాలయం ద్వారా సిబిఐలోని సీనియర్ అధికారులతో జోక్యం చేయించాడని సాన పతీశ్ చెప్పాడని కూడా సిన్హా తన పిటిషన్‌లో ఆరోపించారు.

Investigation on CBI special director RakeshAsthana

Telangana News

Related Stories: