ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలు…

హైదరాబాద్: ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తపాలా శాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది. డెలివరీ సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దే నగదు అందజేయడం, డిపాజిట్లు సేకరించడం వంటి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించింది. తాజాగా మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను మరింత సులభతరం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో తపాలా శాఖ ముందుకు వెళ్తుంది. ఇండియన్‌ పోస్టు బ్యాంకు  సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తే […]

హైదరాబాద్: ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తపాలా శాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది. డెలివరీ సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ఇంటి వద్దే నగదు అందజేయడం, డిపాజిట్లు సేకరించడం వంటి పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించింది. తాజాగా మొబైల్‌ యాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను మరింత సులభతరం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో తపాలా శాఖ ముందుకు వెళ్తుంది. ఇండియన్‌ పోస్టు బ్యాంకు  సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తే తపాలా శాఖ సిబ్బంది వారింటికే నేరుగా వెళ్లి లావాదేవీలను నిర్వహిస్తారు. నగదు ఉపసంహరణ, డిపాజిట్లు చేసుకొనే అవకాశం ఉంది. పోస్టల్‌ శాఖ నూతన సేవలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

India Postal Service Launches Digital Banking Platform

Telangana News 

Related Stories: