జకోవిచ్ కు జ్వరెవ్ షాక్

లండన్: ప్రతిష్టాత్మకమైన ఎటిపి వరల్డ్ టూర్ టైటిల్స్ సింగిల్స్ చాంపియన్‌షిప్‌లో జర్మనీ స్టార్, అలెగ్జాండర్ జ్వరెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జ్వరేవ్ సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్‌జాక్ సాక్ జోడీ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జ్వరెవ్ 64, 63 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. జ్వరెవ్ ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఈ సీజన్‌లో […]

లండన్: ప్రతిష్టాత్మకమైన ఎటిపి వరల్డ్ టూర్ టైటిల్స్ సింగిల్స్ చాంపియన్‌షిప్‌లో జర్మనీ స్టార్, అలెగ్జాండర్ జ్వరెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జ్వరేవ్ సెర్బియా యోధుడు, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ డబుల్స్ విభాగంలో అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్‌జాక్ సాక్ జోడీ చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో జ్వరెవ్ 64, 63 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. జ్వరెవ్ ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జకోవిచ్‌ను హడలెత్తిస్తూ లక్షం దిశగా అడుగులు వేశాడు. జకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాడు.

జ్వరెవ్ దూకుడు ముందు ఎదురు నిలువలేక పోయాడు. కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జ్వరెవ్ ఈసారి మాత్రం అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. చూడచక్కని షాట్లతో జకోవిచ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. జ్వరెవ్ ధాటికి జకోవిచ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జర్మనీ స్టార్ తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో జ్వరెవ్ మరింత దూకుడుగా ఆడాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న జ్వరెవ్ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. మరోవైపు ఎటిపి టూర్ టైటిల్‌తో సీజన్‌ను ఘనంగా ముగించాలని భావించిన జకోవిచ్‌కు నిరాశే మిగిలింది.

ఈ ఏడాది అద్భుత ఆటను కనబరిచిన జకోవిచ్ సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతేగాక ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను కూడా గెలుచుకున్నాడు. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో జకోవిచ్ విజేతగా నిలిచాడు. దీంతోపాటు పలు ప్రతిష్టాత్మకమైన టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అందరి అంచనాలు తారుమారు చేస్తూ అనూహ్యంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. కిందటి సీజన్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన జకోవిచ్ ఈ ఏడాది మాత్రం పూర్వ వైభవం అందుకున్నాడు. రానున్న సీజన్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని తహతహలాడుతున్నాడు.

బ్రియాన్ జోడీకి టైటిల్
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో మైక్ బ్రియాన్‌జాక్ సాక్ జంట టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో బ్రియాన్ జోడీ 57, 61, 1311 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహూట్‌హార్బర్ట్ జంటను ఓడించింది. తొలి సెట్‌లో అమెరికా జంటకు చుక్కెదురైంది. ఫ్రాన్స్ జోడీ అసాధారణ ఆటతో బ్రియాన్ జంటను కంగుతినిపించింది. అయితే రెండో సెట్‌లో అమెరికా జోడీ పుంజుకుంది. తమ మార్క్ ఆటతో చెలరేగిన బ్రియాన్ జోడీ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇరు జోడీలు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డాయి. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. చివరికి అమెరికా జోడీ సెట్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Alexander Zverev stuns to win ATP Finals in London

Telangana News

Related Stories: