బోర్డు భేటీకి ముందు మార్కెట్లు జోష్

ముంబై : ఆర్‌బిఐ బోర్డు సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. అయితే సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు 1 శాతం మేరకు లాభపడ్డాయి. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో దేశీయ సూచీలు పరుగులు తీశాయి. మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ లాభాలతో పైపైకి ఎగసింది. ఆఖరికి 318 పాయింట్లు లాభపడి 35,775 పాయించ్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 81 పాయింట్లు పెరిగి 10,763 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో పిఎస్‌యు బ్యాంక్స్ మాత్రమే […]

ముంబై : ఆర్‌బిఐ బోర్డు సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. అయితే సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు 1 శాతం మేరకు లాభపడ్డాయి. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో దేశీయ సూచీలు పరుగులు తీశాయి. మధ్యాహ్నం నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో సెన్సెక్స్ లాభాలతో పైపైకి ఎగసింది. ఆఖరికి 318 పాయింట్లు లాభపడి 35,775 పాయించ్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 81 పాయింట్లు పెరిగి 10,763 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో పిఎస్‌యు బ్యాంక్స్ మాత్రమే తిరోగమనం బాటలో పయనించింది. మిగతా రియల్టీ, ఎఫ్‌ఎంసిజి, మెటల్, ఆటో, ఫార్మా, ఐటి రంగాలు 2 నుంచి -1 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీలో ప్రధానంగా యస్ బ్యాంక్, ఐటిసి, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్, వేదాంతా, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, గ్రాసిమ్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు ఐబి హౌసింగ్, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, బజాజ్ ఆటో, ఐఒసిలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ షేర్లు కూడా ఉత్సాహంగా కనిపించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,332 లాభపడగా, 1,273 షేర్లు నష్టాలతో ముగిశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) శుక్రవారం దాదాపు రూ. 845 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) శుక్రవారం మరోసారి రూ.372 కోట్ల విలువైన స్టాక్స్ సేల్ చేశాయి.

Domestic stocks market rose by 1 percent

Telangana Latest News