హైదరాబాద్: యువకుల హృదయాల్ని దోచుకుంటున్న కన్నడ సోయగం రష్మిక మందన్న.రష్మికకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో తన మొదటి సినిమా ‘ఛలో’తో మంచి హిట్‌ను అందుకున్న ఈ భామ యంగ్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. వరుసగా బోలెడన్ని ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నా ఏరికోరి మాత్రమే సినిమాలను ఎంపికచేసుకుంటోంది. రష్మిక ‘గీత గోవిందం’ సినిమాతో యూత్‌లో మంచి సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నది. ఇదిలా ఉండగా రష్మిక మందన్న తమిళంలో బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. అరంగేట్ర చిత్రంలోనే తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ సరసన నాయికగా నటించే సువర్ణావకాశాన్ని సంపాదించుకుంది. తాజాగా తమిళంలో విజయ్ అట్లి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. దాదాపు 125కోట్ల భారీ బడ్జెట్‌తో ఎజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా ఎంపిక చేయడం జరిగింది.
రష్మిక కు బంపర్ ఆఫర్…
హైదరాబాద్: యువకుల హృదయాల్ని దోచుకుంటున్న కన్నడ సోయగం రష్మిక మందన్న.రష్మికకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో తన మొదటి సినిమా ‘ఛలో’తో మంచి హిట్‌ను అందుకున్న ఈ భామ యంగ్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. వరుసగా బోలెడన్ని ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నా ఏరికోరి మాత్రమే సినిమాలను ఎంపికచేసుకుంటోంది. రష్మిక ‘గీత గోవిందం’ సినిమాతో యూత్‌లో మంచి సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన […]