రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక

రాయికల్‌ః మండలంలోని భూపతిపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు, అల్లీపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఒకరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పిఇటిలు బందెల శ్రీనివాస్, గంగారాంలు తెలిపారు. భూపతిపూర్ పాఠశాలలో రాజశ్రీ (8వ తరగతి), పవిత్ర (9వ తరగతి) విద్యార్థులు, అల్లీపూర్ పాఠశాలలో 10 వతరగతి చుదువుతున్న కొప్పుల గణేష్‌లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన హైజంపు విభాగంలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థినిలు […]

రాయికల్‌ః మండలంలోని భూపతిపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు, అల్లీపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఒకరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పిఇటిలు బందెల శ్రీనివాస్, గంగారాంలు తెలిపారు. భూపతిపూర్ పాఠశాలలో రాజశ్రీ (8వ తరగతి), పవిత్ర (9వ తరగతి) విద్యార్థులు, అల్లీపూర్ పాఠశాలలో 10 వతరగతి చుదువుతున్న కొప్పుల గణేష్‌లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన హైజంపు విభాగంలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థినిలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో గణేష్ ప్రథమ స్థానంలో నిలిచి త్వరలో ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు. వీరిని పాఠశాల హెచ్‌ఎంలు ఏనుగు రాజరెడ్డి, నాగరాజు ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

Three Students Selected in State level competitions

Telangana News

Related Stories: