ఆకాశం నుంచి ఫైర్ బాల్..

మనం అప్పుడప్పుడూ చదువుతుంటాం. ఆకాశం నుంచి అది ఊడిపడింది, ఇది ఊడిపడింది అని. లేదంటే ఉల్కలు, తోక చుక్కలు అప్పుడప్పుడు ఆకాశం నుంచి భూమ్మీద పడుతుంటాయంటారు. వాటికి సంబంధించిన వార్తలు మనం చాలానే వింటుంటాం. తాజాగా ఓ ఫైర్ బాల్ కూడా ఆకాశం నుంచి ఊడిపడింది. యూఎస్‌లోని టెక్సాస్‌లో పెద్ద ఆకారంలో ఉన్న ఓ ఫైర్ బాల్ మండుతూ భూమ్మీద పడిపోయింది. గత గురువారం రాత్రి 9.22 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ఘటన […]

మనం అప్పుడప్పుడూ చదువుతుంటాం. ఆకాశం నుంచి అది ఊడిపడింది, ఇది ఊడిపడింది అని. లేదంటే ఉల్కలు, తోక చుక్కలు అప్పుడప్పుడు ఆకాశం నుంచి భూమ్మీద పడుతుంటాయంటారు. వాటికి సంబంధించిన వార్తలు మనం చాలానే వింటుంటాం. తాజాగా ఓ ఫైర్ బాల్ కూడా ఆకాశం నుంచి ఊడిపడింది. యూఎస్‌లోని టెక్సాస్‌లో పెద్ద ఆకారంలో ఉన్న ఓ ఫైర్ బాల్ మండుతూ భూమ్మీద పడిపోయింది. గత గురువారం రాత్రి 9.22 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై స్పందించిన నాసా.. అది ఆస్టరాయిడ్ నుంచి విడిపోయిన ఉల్కా అనే వస్తువు అని.. అది రాయిలా ఉంటుందని.. భూమికి సమీపంలోకి రాగానే అది మండుతుందని.. భూమిని తాకగానే అది ఉల్కాపాతంగా మారుతుందని ప్రకటించింది. దీన్ని  సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు.

In US a fire ball fell on ground burning from sky

Telangana Latest News