ప్రణాళికతో ఒత్తిడికి చెక్

పొద్దున లేచినప్పటి నుంచి పనులతో సతమతం అవుతుంటారు మహిళలు. దానికి తోడు ఆఫీసుకి వెళ్లే వారికైతే అక్కడ కూడా పనిభారం మితిమీరడంతో ఒత్తిడికి గురి చేస్తాయి. ఇవన్నీ ఒక స్థాయిలో ఉన్నప్పుడైతే సరే.. కానీ తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా సమస్యలు వాటిల్లుతాయి. ఆ సమయంలో కంగారుపడకుండా, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ  కొన్ని సూచనలు పాటించండి. అందరిలో మంచిపేరు, గొప్ప అనిపించుకోవడం బాగానే ఉంటుంది. కానీ వాటిని ఒత్తిడిలేకుండా నిర్వహించుకోగలిగినప్పుడే మీకా బిరుదు సార్థకమవుతుంది. అందుకే ముందు […]

పొద్దున లేచినప్పటి నుంచి పనులతో సతమతం అవుతుంటారు మహిళలు. దానికి తోడు ఆఫీసుకి వెళ్లే వారికైతే అక్కడ కూడా పనిభారం మితిమీరడంతో ఒత్తిడికి గురి చేస్తాయి. ఇవన్నీ ఒక స్థాయిలో ఉన్నప్పుడైతే సరే.. కానీ తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా సమస్యలు వాటిల్లుతాయి. ఆ సమయంలో కంగారుపడకుండా, వాటికి ప్రత్యామ్నాయంగా ఈ  కొన్ని సూచనలు పాటించండి.

అందరిలో మంచిపేరు, గొప్ప అనిపించుకోవడం బాగానే ఉంటుంది. కానీ వాటిని ఒత్తిడిలేకుండా నిర్వహించుకోగలిగినప్పుడే మీకా బిరుదు సార్థకమవుతుంది. అందుకే ముందు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు. ఎవరికోసం ఏం చేయాలో ఓ కాగితంపై రాసుకోండి. వాటిల్లో నిజంగా మీ అవసరం ఎంతో ఆలోచించండి. ఎవరి సాయం లేకుండా చేసుకునే పనులను పక్కన రాయండి. వాటిని మీ శ్రీ వారు, పిల్లలతో సహా అమలు చేసేలా చూసుకోండి.

1. మల్టీ టాస్కింగ్ వినడానికి బాగానే ఉంటుంది. వాస్తవికత మాత్రం అందుకు దూరమేనంటున్నాయి చాలా అధ్యయనాలు.
అన్ని పనులూ ఒకేసారి చేద్దాంలే అని అస్సలు అనుకోవద్దు. ఇది తీవ్ర ఒత్తిడిని కలుగచేస్తుందని మరవకండి.

2. ప్రణాళికాబద్ధంగా ఏ పని చేసినా సులువుగా పూర్తవుతుంది అందుకే వారానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకోండి. వంట మొదలుకుని దుస్తుల వరకూ అన్నింటా ఇది అమలయ్యేలా చూసు కోండి. ఒక్కరోజు తప్పినా ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయాన్నీ ఏర్పాటు చేసుకోండి. ఇది మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి చికా కులు ఎదురవ్వవు అని నిపుణులు సూచిస్తున్నారు.

Tips for Women Pressure depreciation

Telangana Latest News