‘చిత్రల‌హ‌రి’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

హైదరాబాద్: మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్, కిషోర్ తిరుమ‌ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సిన్మా ‘చిత్రలహరి’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ‘హలో’ ఫేం క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ […]

హైదరాబాద్: మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్, కిషోర్ తిరుమ‌ల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సిన్మా ‘చిత్రలహరి’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ‘హలో’ ఫేం క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘కిషోర్ తిరుమల సినిమా అంటేనే క్యూట్ ఎంట‌ర్‌టైనర్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో ‘చిత్రల‌హ‌రి’ తెర‌కెక్కుతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తా గ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ చిత్రాల‌కు బ్లాక్ బ‌స్టర్ సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌ ప్రజెంట్ చేస్తున్నారు’ అని చెప్పారు.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. ఇక వరుస పరాజయాలతో సతమతవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Chitralahari regular shooting begins

Related Stories: