మ‌హిళ‌లు వ్య‌తిరేకతతో రద్దైన భారీ ప్రాజెక్టు..

దేన్‌క‌న‌ల్ : ఒడిశాలో అడ‌వుల న‌రికివేత‌ను మ‌హిళ‌లు వ్య‌తిరేకించ‌డంతో ఒడిశా సిఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ భారీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు. వివరాలలోకి వెళితే.. దేన్‌క‌న‌ల్ జిల్లాలోని  జింక‌ర్‌గ‌డి అడ‌వుల్లో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఓ బ్రెవ‌రేజ‌స్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని భావించింది. దీని కోసం న‌వంబ‌ర్ 3వ తేదీన సిఎం ప‌ట్నాయ‌క్ శంకుస్థాప‌న కూడా చేశారు. మొత్తం 102 కోట్ల‌తో 12 ఎక‌రాల్లో పిఏ బాటిల్స్ సంస్థ ఈ కంపెనీని స్థాపించాల‌నుకున్న‌ది. అయితే దేన్‌క‌న‌ల్ జిల్లాలోని బ‌ల‌రాంపూర్ మ‌హిళ‌లు […]

దేన్‌క‌న‌ల్ : ఒడిశాలో అడ‌వుల న‌రికివేత‌ను మ‌హిళ‌లు వ్య‌తిరేకించ‌డంతో ఒడిశా సిఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ భారీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు. వివరాలలోకి వెళితే.. దేన్‌క‌న‌ల్ జిల్లాలోని  జింక‌ర్‌గ‌డి అడ‌వుల్లో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఓ బ్రెవ‌రేజ‌స్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని భావించింది. దీని కోసం న‌వంబ‌ర్ 3వ తేదీన సిఎం ప‌ట్నాయ‌క్ శంకుస్థాప‌న కూడా చేశారు. మొత్తం 102 కోట్ల‌తో 12 ఎక‌రాల్లో పిఏ బాటిల్స్ సంస్థ ఈ కంపెనీని స్థాపించాల‌నుకున్న‌ది. అయితే దేన్‌క‌న‌ల్ జిల్లాలోని బ‌ల‌రాంపూర్ మ‌హిళ‌లు ఈ ఉద్య‌మం చేశారు. చిప్‌కో ఉద్య‌మం త‌ర‌హాలో అక్క‌డ అడ‌వుల న‌రికివేత‌ను మ‌హిళ‌లు వ్య‌తిరేకించారు. చెట్ల‌ను హ‌త్తుకుంటూ అక్క‌డి మ‌హిళ‌లు దిగిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో సిఎం నవీన్  ప‌ట్నాయ‌క్ బ్రెవ‌రీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు.

Odisha CM Naveen Patnaik has canceled a huge project

Telangana News

Related Stories: