జర్నలిస్టులపై పోలీసుల దాడి

శేరిలింగంపల్లి : జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసిన సంఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది. జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి నియోజకవర్గ నామినేషన్ ప్రక్రియలో భాగంగా జర్నలిస్టులు అక్కడ విధులు నిర్వహించడం కోసం ప్రధాన గేటు వద్ద వేచి ఉన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట 5 కంటే ఎక్కవ మంది నాయకులు వెళ్ళారని, ఈ విషయంపై పోలీసులను జర్నరిస్టులు వివరణ కోరడంతో వెళ్ళిన వారిని చూపించడానికి ప్రయత్నించారు. అప్పుడు […]

శేరిలింగంపల్లి : జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసిన సంఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది. జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం… శేరిలింగంపల్లి నియోజకవర్గ నామినేషన్ ప్రక్రియలో భాగంగా జర్నలిస్టులు అక్కడ విధులు నిర్వహించడం కోసం ప్రధాన గేటు వద్ద వేచి ఉన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట 5 కంటే ఎక్కవ మంది నాయకులు వెళ్ళారని, ఈ విషయంపై పోలీసులను జర్నరిస్టులు వివరణ కోరడంతో వెళ్ళిన వారిని చూపించడానికి ప్రయత్నించారు. అప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ దేవ్‌రాజ్, కానిస్టేబుల్ రాజమల్లేష్‌లు విలేకరి వినయ్‌కుమార్‌తో పాటు కొంత మంది జర్నరిస్టులను అసభ్య పదజాలం వాడి జర్నలిస్టులను కొట్టి జైలులో వేయండి అంటూ గేటు బయటకు తోసివేశారు. ఈ సంఘటనపై శేరిలింగంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్నకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు జర్నలిస్టులు తెలిపారు.

Police attack on Journalists in Serilingampally

Telangana Latest News

Related Stories: