బ్యాంక్ కార్పొరేట్ రాక్‌స్టార్స్ గ్రాండ్ ఫినాలే…

మాదాపూర్: కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లోని అంతర్లీనంగా దాగి వున్న సృజనాత్మక కళలను వెలికి తియడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్పొరేట్ రాక్ స్టార్స్ పేరుతో ఆదివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 24 కిసెస్ సిని తారా హెబ్బాపటేల్ హజరై రాక్‌స్టార్స్‌ను సన్మానించారు. అనంతరం వివిధ కాంపెనీల నుంచి కార్పొరేట్ ఉద్యోగులు హజరై గత మూడు నెలలుగా ఇన్ఫోసిస్, టెక్ మహింద్ర, కాగ్నిజంట్, ఫ్యాక్ట్‌సెట్, సిఎస్‌ఇ, ఐకెఎస్ గ్లోబల్, […]

మాదాపూర్: కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లోని అంతర్లీనంగా దాగి వున్న సృజనాత్మక కళలను వెలికి తియడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్పొరేట్ రాక్ స్టార్స్ పేరుతో ఆదివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 24 కిసెస్ సిని తారా హెబ్బాపటేల్ హజరై రాక్‌స్టార్స్‌ను సన్మానించారు. అనంతరం వివిధ కాంపెనీల నుంచి కార్పొరేట్ ఉద్యోగులు హజరై గత మూడు నెలలుగా ఇన్ఫోసిస్, టెక్ మహింద్ర, కాగ్నిజంట్, ఫ్యాక్ట్‌సెట్, సిఎస్‌ఇ, ఐకెఎస్ గ్లోబల్, విర్చుసా మొదలైన పలు కార్పొరేట్ సంస్థలలో జరిగిన పోటీల అంతిమ ఘట్టం యొక్క సమాహరమే ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్పొరేట్ రాక్‌స్టార్స్ గ్రాండ్ ఫినాలే. ఇందులో ఉద్యోగులు ఎంతో ఉత్సహంగా పాల్గొని తమలోని ప్రతిభా పాటవాలను వెలికి తీసి ప్రదర్శించడం జరిగింది. ప్రతి విభాగానికి మొదటి స్థానంలో నిలిచిన 30 మంది పురుషులు, మహిళలు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో జరిగిన కార్యక్రమానికి పేక్షకులుగా ఉన్న సహచర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వారి ప్రదర్శనలకు మైమరిచిపోయారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేటర్ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

HDFC Bank celebrating with name corporate rock stars

Telangana Latest News

Related Stories: