కల్వకుర్తిలో టిఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ నామినేషన్

కడ్తాల్: కల్వకుర్తి టిఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ నామినేషన్ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో గులాబీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై కడ్తాల్ మండల కేంద్రానికి చేరుకోవడంతో మండలంలో హైద్రాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది. ర్యాలీని ప్రారంభించిన మంత్రి జూపల్లి […]


కడ్తాల్: కల్వకుర్తి టిఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ నామినేషన్ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో గులాబీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై కడ్తాల్ మండల కేంద్రానికి చేరుకోవడంతో మండలంలో హైద్రాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది. ర్యాలీని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌సి కసిరెడ్డి నారయణరెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్, మాజీ ఎంఎల్‌ఎ ఎడ్మ కిష్టారెడ్డి, రాష్ట్ర నాయకులు బాలాజీసింగ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, ద్యాప విజితారెడ్డిలు ప్రత్యేకంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంప వెంకటేష్ గుప్త ఏర్పాటు చేసిన ప్రచార వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కంబాల పరమేష్, మండల కోఆర్డినేటర్ జోగు వీరయ్య, మండల అధ్యక్షుడు తుల్సిరాం, యాదగిరిరెడ్డి, యాదయ్య, బిక్కునాయక్, మహేష్ హెచ్‌ఆర్, తదితరులు పాల్గొన్నారు.

trs candidate jaipal yadav filing nominations in Kalwakurthy

Telangana News

Related Stories: