కోదాడలో వేణుమాధవ్ నామినేషన్ దాఖలు

సూర్యాపేట : కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా సినీ నటుడు వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం నాడు ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చారు. అయితే తగిన పత్రాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో సోమవారం ఆయన తన మద్ధతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే […]

సూర్యాపేట : కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా సినీ నటుడు వేణుమాధవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం నాడు ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చారు. అయితే తగిన పత్రాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ క్రమంలో సోమవారం ఆయన తన మద్ధతుదారులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు వేణుమాధవ్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Actor Venu Madhav Filed the Nomination in Kodad

Related Stories: