ప్రొఫెసర్ వేధింపులు : నిట్ విద్యార్థి ఆత్మహత్య

బెంగళూరు: మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చోటుచేసుకుంది. విద్యార్థి 6వ ఫ్లోర్ లోని తన డిపార్ట్ మెంట్ కిటికీలోంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్టూడెంట్ ఆనంద్ పఠాక్ గా పోలీసులు గుర్తించారు. తమ డిపార్ట్ మెంట్ లోని ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆనంద్ పఠాక్ బలవన్మరణానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. మృతుడు ఆనంద్ పఠాక్ హాజరు శాతం తక్కువగా ఉందని సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ప్రొఫెసర్ […]

బెంగళూరు: మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చోటుచేసుకుంది. విద్యార్థి 6వ ఫ్లోర్ లోని తన డిపార్ట్ మెంట్ కిటికీలోంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్టూడెంట్ ఆనంద్ పఠాక్ గా పోలీసులు గుర్తించారు. తమ డిపార్ట్ మెంట్ లోని ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆనంద్ పఠాక్ బలవన్మరణానికి పాల్పడినట్టు తోటి విద్యార్థులు తెలిపారు.

మృతుడు ఆనంద్ పఠాక్ హాజరు శాతం తక్కువగా ఉందని సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ప్రొఫెసర్ వేధించినట్టు తోటి విద్యార్థులు తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. విద్యార్థి మృతికి కారణమైన ప్రొఫెసర్ సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Nit Student Suicide

telangana latest news

Related Stories: