మహాకూటమికి కాంగ్రెస్ ఝలక్!

హైదరాబాద్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు సోమవారంతో ముగియనుంది. ఈ తరుణంలో మహాకూటమిలోని తమ మిత్రపార్టీలకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఈ ట్విస్ట్ తో కూటమిలో కొట్లాట మరింత ముదరనుందని రాజకీయ విశ్లేషకులు అంచన కడుతున్నారు. కాగా, కాంగ్రెస్ పొత్తులో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేసి, మిగతా సీట్లను టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం...అనూహ్యంగా 100 స్థానాలకు బిఫామ్ లు ఇచ్చింది. సోమవారం ఉదయం […]

హైదరాబాద్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి గడువు సోమవారంతో ముగియనుంది. ఈ తరుణంలో మహాకూటమిలోని తమ మిత్రపార్టీలకు కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఈ ట్విస్ట్ తో కూటమిలో కొట్లాట మరింత ముదరనుందని రాజకీయ విశ్లేషకులు అంచన కడుతున్నారు. కాగా, కాంగ్రెస్ పొత్తులో భాగంగా 94 స్థానాల్లో పోటీ చేసి, మిగతా సీట్లను టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం...అనూహ్యంగా 100 స్థానాలకు బిఫామ్ లు ఇచ్చింది.
సోమవారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో 6 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతూ బిఫామ్ లు జారీచేశారు. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి, దుబ్బాకలో మద్దుల నాగేశ్వర్ కు, పటాన్ చెరులో కాట శ్రీనివాస్ కు ఉత్తమ్ బిఫామ్ లు ఇచ్చారు. టిడిపికి కేటాయించిన ఇబ్రహీంపట్నం సీటులో ఆ పార్టీ సామ రంగారెడ్డికి బిఫామ్ ఇవ్వగా… నేడు ఉత్తమ్ మల్ రెడ్డి రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంతో  ఆ స్థానంలో అయోమయం నెలకొంది. వరంగల్ తూర్పు, మహబూబ్ నగర్, మిర్యాలగూడల్లో మహాకూటమి పార్టీల నడుమ స్నేహపూర్వక పోటీ ఉందని కాంగెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పార్టీలకు హండ్ ఇవ్వడంతో రచ్చ మరి కాస్త ముదిరేలా కొడుతోంది.
Congress Party Shock To Mahakutami

telangana latest news