‘ఆర్ ఆర్ ఆర్’షూటింగ్ షురూ…!

హైదరాబాద్: ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమా గత వారమే పూజకార్యక్రమం జరుపుకుంది. కాగా,  ఇవాళ్టి(సోమవారం) నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. గత వారం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించిన యూనిట్, నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ తో రంగంలోకి దిగనుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తన ట్విట్టర్ […]

హైదరాబాద్: ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమా గత వారమే పూజకార్యక్రమం జరుపుకుంది. కాగా,  ఇవాళ్టి(సోమవారం) నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. గత వారం ముహూర్తపు షాట్ ను చిత్రీకరించిన యూనిట్, నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ తో రంగంలోకి దిగనుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ స్టార్ట్స్ రోలింగ్ టూడే అంటూ ట్వీట్ చేశారు. అలాగే సెట్స్ లో తారక్, చెర్రీలతో దిగిన ఓ ఫోటోను ఆయన పోస్టు చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు ఈ చిత్రం బాగా రావాలని, బాహుబలిని మించిన విజయం సాధించాలంటూ అభినందనలు తెలుపుతూ రిట్వీట్లు చేస్తున్నారు.

SS Rajamouli’s RRR Movie Shoot Begins Today

Telangana Breaking News