యాగవల్లి

మిన్నంటిన వేదపఠనం హోమం జరిపిన కెసిఆర్ నేటి నుంచి మలివిడత ప్రచార శంఖారావం మన తెలంగాణ/హైదరాబాద్: వేద మంత్రోచ్ఛారణలతో ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. రాజ శ్యామల చండీ హోమంతో పాటు చండీ సహిత రుద్ర హోమం, మాతంగి చండీ హోమం తదితర ఆరు హోమాలు చేస్తున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అయుత చండీయాగం చేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ హోమాలను నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్న జియర్ దివ్య సాకేతంలో కొద్ది […]

మిన్నంటిన వేదపఠనం
హోమం జరిపిన కెసిఆర్
నేటి నుంచి మలివిడత ప్రచార శంఖారావం

మన తెలంగాణ/హైదరాబాద్: వేద మంత్రోచ్ఛారణలతో ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. రాజ శ్యామల చండీ హోమంతో పాటు చండీ సహిత రుద్ర హోమం, మాతంగి చండీ హోమం తదితర ఆరు హోమాలు చేస్తున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అయుత చండీయాగం చేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ హోమాలను నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్న జియర్ దివ్య సాకేతంలో కొద్ది రోజుల క్రితం జరిగిన యాగంలో కెసిఆర్ పాల్గొనగా ఇప్పుడు స్వయంగా ఆయనే తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ హోమాలు సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతితో ముగుస్తాయి. అనంతరం సోమవారం రాత్రి ‘ఏకరాత్రి’ దీక్షలు పాటిస్తారు. ఈ కృతుల్లో కెసిఆర్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు, మంత్రులు పలువురు పాల్గొన్నారు. సుమారు 75 మంది రుత్వికులు ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి దయతో దిగ్విజయంగా ముందుకు సాగాలని కెసిఆర్ ఆకాంక్షిస్తూ ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సూర్య నమస్కారాలు, మహా లింగార్చన, అన్ని గ్రహాలకు హోమాలు, చండీయాగం తదితరాలను నిర్వహించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్విక్కులు పాల్గొన్నారు. ‘కామ్యసిద్ధి’ కోసం జరిపే ఈ హవనంతో పాటు నవగ్రహ పాశుపతం, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహిస్తున్నారు. శృంగేరి ఆస్థాన పండితులు ఫణి శశాంక్ శర్మ, గోపికృష్ణ శర్మ ఆధ్వర్వంలో 72 మంది రుత్విక్కులు మహా రుద్ర సహిత హోమం కూడా నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి అనంతరం కెసిఆర్ నేరుగా ఖమ్మంలో జరిగే ప్రజా ఆశీర్వాద ప్రచార సభకు వెళ్తారు.

KCR to perform Raja Shyamala Chandi Homam today

Telangana Latest News

Related Stories: