చివరి రెండూ బిసిలకే

తుది జాబితా ప్రకటించిన టిఆర్‌ఎస్ మొత్తం 119 స్థానాలకూ పూర్తయిన అభ్యర్థుల ప్రకటన ముఠాగోపాల్‌కు ముషీరాబాద్, బొల్లం మల్లయ్యకు కోదాడ  మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మిగిలిన రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులనూ ఖరారు చేశారు. ముషీరాబాద్ స్థానాన్ని ముఠా గోపాల్‌కు, కోదాడ స్థానాన్ని […]

తుది జాబితా ప్రకటించిన టిఆర్‌ఎస్
మొత్తం 119 స్థానాలకూ పూర్తయిన అభ్యర్థుల ప్రకటన

ముఠాగోపాల్‌కు ముషీరాబాద్, బొల్లం మల్లయ్యకు కోదాడ 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మిగిలిన రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులనూ ఖరారు చేశారు. ముషీరాబాద్ స్థానాన్ని ముఠా గోపాల్‌కు, కోదాడ స్థానాన్ని బొల్లం మల్లయ్యకు కేటాయించారు. ఈ రెండు స్థానాలూ బిసిలకే దక్కాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కెసిఆర్, ఆ తర్వాత దశలవారీగా మిలిగిన అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ రెండు స్థానాల విషయంలో సుధీర్ఘ కసరత్తు చేసి ఆదివారం ప్రకటించారు. ముషీరాబాద్ స్థానాన్ని తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ బిసి వర్గానికి కేటాయించాలని భావించిన కెసిఆర్ నాయిని నర్సింహారెడ్డిని ఒప్పంచి ముషీరాబాద్ టికెట్‌ను ముఠా గోపాల్ (మత్సకారుల సామాజికవర్గం)కు కేటాయించారు.

ఆ స్థానంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్‌లు పోటీ చేస్తున్నారు. ఈ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఠా గోపాల్‌కు టిఆర్‌ఎస్ ఆ స్థానాన్ని కేటాయించింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు బి.ఫారం అందజేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ముఠా గోపాల్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే టిపిసిసి అద్యక్షుడు ఉత్తమ్‌కుమర్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న కోదాడ స్థానంలో సైతం గట్టి పోటీ ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నుంచి వచ్చి టిఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు కేటాయించారు. మహాకూటమిలో భాగంగా కోదాడ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన మల్లయ్య యాదవ్‌కు వెంటనే కోదాడ స్థానాన్ని కేటాయించడం గమనార్హం. మంత్రి జి.జగదీష్‌రెడ్డి సమక్షంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

TRS announces final list of candidates for Assembly poll

Telangana Latest News

Related Stories: