బుజ్జగుంపులు

కాంగ్రెస్ టిక్కెట్ లభించలేదన్న బాధతో హరీశ్‌రావు వద్ద కంటతడి పెట్టిన మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్‌లో తామరతంపరగా అసంతృప్తులు ఆదివారం సాగిన తొలివిడత బుజ్జగింపులు నేడు కూడా కొనసాగనున్న పర్వం అయినా చల్లారని అసమ్మతి మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లో టిజెఎస్ స్నేహ పోటీ కమిటీ సభ్యులు అరగంట బుజ్జగించినా సంతృప్తిపడని మల్‌రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి నామినేషన్ వేయనున్నట్టు ప్రకటన మళ్లీ రిక్తహస్తమేనని పొంగులేటి ఆవేదన సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి విషయంలోనూ సందిగ్ధం కమిటీని కలుసుకోని క్యామ […]

కాంగ్రెస్ టిక్కెట్ లభించలేదన్న బాధతో హరీశ్‌రావు వద్ద కంటతడి పెట్టిన మాజీ మంత్రి ముత్యం రెడ్డి

కాంగ్రెస్‌లో తామరతంపరగా అసంతృప్తులు

ఆదివారం సాగిన తొలివిడత బుజ్జగింపులు

నేడు కూడా కొనసాగనున్న పర్వం

అయినా చల్లారని అసమ్మతి

మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లో టిజెఎస్ స్నేహ పోటీ

కమిటీ సభ్యులు అరగంట బుజ్జగించినా సంతృప్తిపడని మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం నుంచి నామినేషన్ వేయనున్నట్టు ప్రకటన
మళ్లీ రిక్తహస్తమేనని పొంగులేటి ఆవేదన
సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి విషయంలోనూ సందిగ్ధం
కమిటీని కలుసుకోని క్యామ మల్లేష్, షోకాజుకు నిర్ణయం
ఇరవై మంది అసంతృప్తులతో తొలిరోజు చర్చలు
నేడు మరి 20మందితో భేటీ
చాలా వరకు పరిష్కారం అయింది: మధుయాష్కి

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద గణనీయంగా ఉందని భావించి ఆందోళన పడుతున్న పార్టీ అధిష్టానం బుజ్జగింపుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేసి తన వంతు ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన అవకాశాలు లేదా నామినేటెడ్ పదవులు అప్పజెప్తామని నమ్మిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు కనీసంగా నలభై చోట్ల అసంతృప్తి, అసమ్మతి, రెబల్స్ ప్రమాదం ఉందని భావించి ఓటింగ్‌లో అది ప్రతిబింబించకుండా నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో ఈ కమిటీ బుజ్జగింపు చర్యలు చేపట్టింది. ఇంత చేస్తున్నా కూటమి భాగస్వామ్య పార్టీ గా ఉన్న తెలంగాణ జన సమితి తరఫున కొన్నిచోట్ల ‘స్నేహపూర్వక పోటీ’ తప్పడంలేదు. పుదుచ్చేరి ము ఖ్యమంత్రి నారాయణ స్వామి అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు, కర్నాటక మంత్రి డికె శివకుమార్ ఏర్పడిన ఈ బుజ్జగింపుల కమిటీ మొత్తం నలభై మంది అసంతృప్తివాదులతో భేటీ కావాలని నిర్ణయించింది. తొలి రోజైన ఆదివారం సగం మందితో భేటీ కాగా సో మవారం కూడా దీన్ని కొనసాగించనుంది. నామినేషన్ల పూర్తి కావడంతోనే సరిపెట్టుకోకుండా ఉపసంహరణలో కూడా రెబల్స్ పోటీని నివారించే దిశగా ఈ కమిటీ చొరవ తీసుకుంటోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు తొలిసారిగా తెలంగాణ ఈ తరహా విధానం అమల్లోకి వచ్చింది.

బుజ్జగింపుల మంత్రాంగం ఫలించేనా?
అధికారికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న ఈ కమిటీ పలువురు ఆశావహులతో భేటీ అయింది. కానీ ఏ మేరకు వారు సంతృప్తి చెందారనేది అనుమానంగానే ఉంది. అరచేతిలో వైకుంఠాన్ని ఈ కమిటీ చూపుతోందని ఒకరిద్దరు ఆశావహులు అభిప్రాయపడ్డారు. తిరుగుబాటుదారులను శాంతింపచేస్తే తప్ప విజయావకాశా లు సాధించలేమని భావించిన కాంగ్రెస్ ఈ నూ తన ప్రక్రియపై సీరియస్‌గానే దృష్టి సారించింది. రెబల్స్ నుంచి ప్రధానంగా వచ్చే డిమాండ్లు, స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఓటింగ్‌పై పడే ప్రభావం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వారికి ఈ కమిటీ తగిన ప్రత్యామ్నాయాలపై హామీ ఇస్తోంది. ఎంఎల్‌సి అవకాశాలతో పాటు నామినేటెడ్ పదవులను కట్టబెట్టనున్నట్లు నచ్చచెప్తోంది. భేటీ అనంతరం పలువురు తిరుగుబాటుదారులు కచ్చితంగా సీటు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. పోటీ చేయకపోతే నియోజకవర్గాల్లో తమ ప్రతిష్ట దెబ్బతింటుందని, కేడర్‌ను కోల్పోతామని ఈ కమిటీకి వివరించినట్లు తెలిసింది.

సీట్ వస్తుందనే ఆశతో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే లక్షలాది రూపాయలను ఖర్చు చేసినట్లు మొరపెట్టుకున్నారు. జనగామ నియోజకవర్గ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యతో సైతం ఈ కమిటీ సమావేశమైంది. కమిటీ ముందు హాజరైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోయినట్లు వివరించారు. ప్రస్తుతం అదే పరిస్థితిలో సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని మొరపెట్టుకున్నారు. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో విధ బాధ్యతలు నిర్వహించిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి కుమార్తె స్రవంతి ఈ కమిటీని కలిశారు. మునుగోడు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డిని ఆ నామినేషన్ విరమించుకోవాలని స్పష్టం చేసిం ది. స్థానిక నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది.

క్యామ మల్లేష్‌కు షోకాజ్ నోటీసు
కమిటీ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినా స్పందించకపోవడంతో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు నోటీసులు జారీచేయాలని రాష్ట్ర కమిటీని ఆదేశించింది. కరీంనగర్ నియోజకవర్గం ఆశిస్తున్న కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నెరేళ్ల శారదను కమిటీ బుజ్జగించింది. ఇబ్రహీంపట్నం టిక్కెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎంఎల్‌ఏ మల్‌రెడ్డి రంగారెడ్డితో కమిటీ సుమారు అరగంటకు పైగా చర్చించి అవకాశాలను వివరించింది. ఆ తర్వాత బైటకువచ్చిన రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. వర్థన్నపేటను ఆశిస్తున్న నాయిని రాజేందర్, సికింద్రాబాద్ కోసం పట్టుబడుతున్న పల్లె లక్ష్మణ్ గౌడ్, పరకాల సీటు కోరుకుంటున్న ఇనిగల వెంకటరామిరెడ్డి, మేడ్చల్ కోసం పట్టుబట్టిన తోటకూర జంగయ్యయాదవ్, కొత్తగూడెం కావాలంటున్న డి రవీంద్రనాయక్, కరీంనగర్ నియోజకవర్గం ఆశావాహులు రేగులపాటి రమ్య, బల్మూర్ వెం కట్. గజ్జలకాంతం, దరువు ఎల్లన్న, దుర్గా భవాని, లక్ష్మణ్ గౌడ్, ఉజ్మ షకీల్ అహ్మద్ తదితరులున్నారు.

చాలా వరకు పరిష్కారమైంది : మధుయాష్కీ
బుజ్జగింపుల కమిటీతో తిరుగుబాటు అభ్యర్థులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి మధు యాష్కీ తెలిపారు. సుమారు ఐదు వేల మంది ఆశావాహులు పోటీకి సిద్ధంగా దరఖాస్తులు చేసుకున్నప్పుడు రెబల్స్ ఉండటం సహజమని, వారిని బుజ్జగించే బాధ్యత కూడా పార్టీపైనే ఉందని చెప్పారు. కులాలు,పొత్తులు, మహాకూటమి సర్దుబాటులో కొంతమంది సమర్థతగల నాయకులకు జరిగిన అన్యాయాన్ని కమిటీ అంగీకరించిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవకాశాలు కోల్పోయిన వారికి సముచిత గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు.

టిజెఎస్‌తో కొత్త తలనొప్పి
కూటమి పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో తెలంగాణ జన సమితి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ చేస్తామని, అక్కడ కాంగ్రెస్ పోటీ చేసినా తమ పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది. మిర్యాలగూడ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నా ఆ స్థానాన్ని ఆశిస్తున్న తెలంగాణ జన సమితి విద్యాధర్‌రెడ్డి అనే అభ్యర్థిని ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో బరిలోకి దించనుంది. మహబూబ్‌నగర్ నుంచి టిడిపి తరఫున ఎర్ర శేఖర్ పోటీ చేస్తున్నా అక్కడి నుంచి కూడా టిజెఎస్ తరఫున రాజేందర్‌రెడ్డిని బరిలోకి దించాలనుకుంటోంది. ఈ తరహా పోటీతో కాంగ్రెస్‌కు ఏ మేరకు దెబ్బ తగులుతుంది, టిజెఎస్ అభ్యర్థులకు స్థానికంగా ఏ మేరకు ప్రజాదరణ ఉంది, ఓటు బ్యాంకుపై అది చూపే ప్రభా వం ఎంత తదితరాలపై కూడా కాంగ్రెస్ కసరత్తును ప్రారంభించింది.

Congress ticket was not given to Muthyam Reddy

Telangana Latest News

Related Stories: