మొండి చెయ్యి పార్టీ

కోదండరాంకు చెయ్యిచ్చారు ఆయనను కరివేపాకులా వాడుకున్నారు మహాకూటమి వస్తే జిఓలు అమరావతి నుంచి వస్తాయి రాహుల్ సీట్లు ఇస్తే చంద్రబాబు నోట్లు ఇచ్చారు ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలే : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: రాహుల్ గాంధీ సీట్లు ఇవొచ్చు, చంద్రబాబు నోట్లు ఇవొచ్చు, ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలవని మహాకూటమి గుర్తుంచుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం టిఆర్‌ఎస్ భవన్‌లో చొప్పదండి, వరంగల్ వెస్ట్, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు టిఆర్ ఎస్ […]

కోదండరాంకు చెయ్యిచ్చారు
ఆయనను కరివేపాకులా వాడుకున్నారు
మహాకూటమి వస్తే జిఓలు అమరావతి నుంచి వస్తాయి
రాహుల్ సీట్లు ఇస్తే చంద్రబాబు నోట్లు ఇచ్చారు
ఓట్లు వేసేది మాత్రం తెలంగాణ ప్రజలే : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాహుల్ గాంధీ సీట్లు ఇవొచ్చు, చంద్రబాబు నోట్లు ఇవొచ్చు, ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలవని మహాకూటమి గుర్తుంచుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం టిఆర్‌ఎస్ భవన్‌లో చొప్పదండి, వరంగల్ వెస్ట్, వేములవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు టిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ కరీంనగర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. కెసిఆర్ ఎంపి పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసినప్పుడు 2 లక్షల మెజార్టీ ఓట్లతో ఆయన్ను గెలిపించారని కెటిఆర్ పేర్కొన్నారు. 2001లో టిఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు టిఆర్‌ఎస్‌కు, కెసిఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలేనని ఆయన పేర్కొన్నారు.

టిఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం చేరికలతో కళకళలాడుతుంటే గాంధీభవన్ సెలెన్ బాటిళ్లతో గాంధీ ఆస్పత్రిగా మారిందన్నారు. బౌన్సర్ల రక్షణలో గాంధీ భవన్ ఉందన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా టిఆర్ ఎస్ భవన్ మారిందన్నారు. గత ఎన్నికల్లో జగిత్యాల సీటును ఓడిపోయామని ఈసారి ఆ టికెట్‌తో సహా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలను గెలిపించుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. చొప్పదండి నియోజకవర్గంలోనే కెసిఆర్ అత్తగారి ఇళ్లు ఉందని, కెసిఆర్ అల్లుడు కనుక ఆయన్ను బాగా చూసుకోవాల్సిన అవసరం చొప్పదండి ప్రజలకు ఉందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో చొప్పదండి అభ్యర్థి బొడిగే శోభను మార్చాల్సివచ్చిందని, ఆ అభ్యర్థికి ఓపిక లేక వేరే పార్టీ మారారన్నారు. 2014 ఎన్నికల్లో సుంకె రవిశంకర్ టికెట్ కోసం ప్రయత్నిస్తే ఆయనకు కేటాయించకుండా బోడిగె శోభకు కేటాయించామని, ఆయన అప్పటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారని, అందుకే ఈ సారి ఆయనకు ఈ టికెట్ కేటాయించామన్నారు.

ఎవరెంత దుష్ర్పచారం చేసినా చొప్పదండి లో టిఆర్ ఎస్ అభ్యర్థి రవిశంకర్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు పథకానికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు వచ్చిందని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని గుర్తించడం లేదన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసగించేందుకు అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల కోసమే కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రాష్ర్టమంతటా కారు ..సారూ.. టిఆర్ ఎస్ సర్కారు అన్న మాట వినిపిస్తుందన్నారు. నాలుగేళ్లలో ఎన్నో పథకాలు అమలు చేశామని, కారు జోరు మీద ఉందని, డ్రైవర్ ను మార్చొద్దన్నారు. కాంగ్రెస్ గుర్తుకు దగ్గట్టుగానే కోదండరాం కు మొండి చెయ్యి ఇచ్చారని ఆయన ఆరోపించారు. కోదండరాం ను కరివేపాకు లా వాడుకున్నారని ఆయన ఆరోపించారు.

పొరపాటున కూటమికి ఓటేస్తే తెలంగాణ వనరులు పరాయి వాళ్ళ పరం అవుతాయన్నారు. టిఆర్ ఎస్ అభ్యర్థి కి ఓటేస్తే అది కెసిఆర్ కే చేరుచేరుతుందని, కూటమి అభ్యర్థికి వేస్తే అమరావతికి , ఢిల్లీ కి ఆ ఓటు చేరుతుందని ఆయన ఆరోపించారు. సీట్లు సరిగా ఖరారు చేసుకోలేని వారు రేపు పొరపాటున అధికారమిస్తే ఎలా పాలిస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇపుడిపుడే తెలంగాణ కోలుకుంటోందని, ఓటు ను ఆలోచించి వేయాలని, కెసిఆర్ ను పదికాలాల పాటు ఆశీర్వదించేందుకు ఈ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను గెలిపించుకోవాలన్నారు. మంత్రి కెటిఆర్ సమక్షం లో చొప్పదండి నియోజక వర్గ వివిధ పార్టీ ల నేతలు వెలిచాల తిరుమల రావు , బీజేపీ కిసాన్ మోర్చా నేత తిరుపతి రెడ్డి తదితరులు పార్టీలో చేరారు. తదితరులు పాల్గొన్నారు.

పార్టీలు మార్చిన వారికి టికెట్లా….
అంగీలు మార్చినట్టు పార్టీలు మార్చిన వారికి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తుందని కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మంత్రి కెటిఆర్ సమక్షంలో వేముల వాడ కాంగ్రెస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి ,ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ మనోహర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 2006 లోనే టిఆర్ ఎస్‌లో చేరమని ఆయన్ను కోరినా దానిని సున్నితంగా తిరస్కరించారని, ఇప్పుడు టిఆర్ ఎస్‌లోకి రావడం సంతోషకరమన్నారు. మనోహర్ రెడ్డి కి టిఆర్ ఎస్ లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన హామినిచ్చారు. వేముల వాడ పేరు ను సమైక్య పాలకులు బద్నావ్‌ు చేశారని, వేములవాడ పోయిన వారి మంత్రి పదవి ఊడుతుందని దుష్ర్పచారం చేశారని, చివరకు దేవుడిని కూడా వారు వదలలేదన్నారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రూపు రేఖలను సీఎం కెసిఆర్ మార్చారన్నారు.

ఇప్పటికే వేములవాడ లో 40 వేల ఎకరాల కు సీఎం కెసిఆర్ సాగు నీళ్లీచ్చారని ఆయన తెలిపారు. కరీంనగర్ మెట్టప్రాంతమని, గోదావరి నీళ్లతో రైతుల పాదాలను కెసిఆర్ కడిగారని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కెసిఆర్ ఆలోచించారని ఆయన తెలిపారు. 40 సంవత్సరాలు కొట్లాడుకున్న పార్టీ లు ఒక్కటయ్యాయని, కిందిస్థాయి కార్యకర్తలు ఎందుకు కలిసిపోతారని ఈ విషయమై టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఆలోచించడం లేదన్నారు. టిడిపి, కాంగ్రెస్ పొత్తు వలన ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. కోదండరాం సార్ అమాయకుడని, ఆయన నెత్తి మీద చేయి పెట్టారని, కాంగ్రెస్ రాజకీయంలో ఆయన బలయ్యారని కెటిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది అభయ హస్తం కాదని, భస్మాసుర హస్తమన్నారు. టిక్కెట్లు అమ్ముకునే వాళ్ళు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ ను ఎలాగయినా దించాలని ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని ఆయన ఆరోపించారు.

వేముల వాడ ప్రజలు డబ్బు దోచుకున్న వారి వైపు ఉంటారో ,వేముల వాడ అభివ ద్ధి చేసిన వారి వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. రేపు మహా కూటమి అధికారం లోకి వస్తే జీవో లు కూడా అమరావతి నుంచి జారీ అవుతాయని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాలు కాంగ్రెస్ లో కొనసాగాను, టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కెసిఆర్ పాలన లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని అందుకే ఈపార్టీలో చేరుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
కెసిఆర్ ప్రభుత్వం వస్తేనే

పేదల ముఖంలో చిరునవ్వు..
పేదలు కెసిఆర్ ప్రభుత్వమే రావాలని బలంగా కోరుకుంటున్నారని, కెసిఆర్ ప్రభుత్వం వస్తేనే పేదల ముఖం చిరునవ్వుతో వెలుగుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రి కెటిఆర్ సమక్షం లో టిఆర్ ఎస్ వరంగల్ వెస్ట్ నియోజక వర్గానికి చెందిన సీపీఐ, ఎంఆర్‌పిఎస్ నాయకులు చేరారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పార్టీ ల కార్యకర్తలు ఎవరయినా, కండువాలు ఏవయినా వారి గుండెల నిండా కెసిఆర్ మాత్రమే ఉంటారన్నారు. గెలిచే నాలుగు సీట్ల కోసం కూటమి నేతలు కొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వరంగల్ వెస్ట్ లో రేవూరి కి పోటీ చేసే హక్కు ఉందా, ఆయన ఏ ఊరి ప్రకాష్ రెడ్డి, అమరావతి ప్రకాష్ రెడ్డా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ రాకుండా అడ్డుకుంది చంద్రబాబు అని ఆయన ప్రతినిధి రేవూరి ప్రకాష్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. కూటమి టికెట్ లు అమరావతి లో నిర్ణ యించారని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు టిటిడిపి నేతలు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టు లను అడ్డుకుంటున్నందుకు చంద్రబాబు పార్టీ కి ఓటేయ్యాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. పొరపాటున కూడా దొంగల చేతికి అధికారం ఇవ్వొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

KTR speech about mahakutami in telangana bhavan

Telangana Latest News

Related Stories: