నిర్లక్ష్యంగా నడిపిన ఆర్‌టిసి బస్సుకు దంపతులు బలి

మన తెలంగాణ /బోడుప్పల్ : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి వున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న కోటేశ్వర్  రావు (29)నగరంలోని  ఓ ప్రవేటు కంపెనీలో మార్కెంటిగ్ పని చేస్తున్నాడు. భార్య స్వప్న(21) గృహిణి  ఆదివారం సాయంత్రం ఘట్‌కేసర్ […]

మన తెలంగాణ /బోడుప్పల్ : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి వున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న కోటేశ్వర్  రావు (29)నగరంలోని  ఓ ప్రవేటు కంపెనీలో మార్కెంటిగ్ పని చేస్తున్నాడు. భార్య స్వప్న(21) గృహిణి  ఆదివారం సాయంత్రం ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో ఉంటున్న స్వప్న చిన్నమ్మ వద్దకు బైకుపై వెళ్లి తిరిగి వస్తుండగా నారపల్లిలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైకును నిలిపారు.

యాదగిరి గుట్టకు వెళ్తున్న యాదాద్రి డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడుపుతూ డివైడర్‌తో పాటు ఆగివున్న రెండు భైకులకు ఢీ కోట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రవేటు దవాఖానాలో పరీక్షంచగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో బైకుపై ఉన్న ఇద్దరికి గాయాలైయ్యాయి. వీరు నగరంలోని ప్రవేటు అసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Husband wife dead in rtc bus accident at Boduppal

Telangana Latest News

Related Stories: