మిక్కీమౌస్ @ 90

లండన్ : ఆబాల గోపాలాన్ని, ఇంటిల్లిపాదిని కవ్వింతలతో  ఉర్రూతలూగిస్తూ వస్తోన్న మిక్కీ మౌస్ 90వ జన్మదినం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. వాల్ట్‌డిస్పీ ట్రేడ్‌మార్క్‌తో కార్టూన్ కితకితలుగా తొలిసారిగా తొంభై ఏళ్ల క్రితం నవంబర్ 18న మిక్కీమౌస్ ప్రత్యక్షం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది మనసులను గెల్చుకుంది. తమ చేష్టలతో మిక్కిమౌస్ చిరకాలంగా కార్టూన్ల ప్రపంచాన్ని శాసించడం చిన్న విషయమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా మిక్కీకి ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో నాలుగేళ్ల బుడతలు మొదలుకుని నాలుగు పదుల పెద్దల […]

లండన్ : ఆబాల గోపాలాన్ని, ఇంటిల్లిపాదిని కవ్వింతలతో  ఉర్రూతలూగిస్తూ వస్తోన్న మిక్కీ మౌస్ 90వ జన్మదినం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. వాల్ట్‌డిస్పీ ట్రేడ్‌మార్క్‌తో కార్టూన్ కితకితలుగా తొలిసారిగా తొంభై ఏళ్ల క్రితం నవంబర్ 18న మిక్కీమౌస్ ప్రత్యక్షం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కోట్లాది మంది మనసులను గెల్చుకుంది. తమ చేష్టలతో మిక్కిమౌస్ చిరకాలంగా కార్టూన్ల ప్రపంచాన్ని శాసించడం చిన్న విషయమేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా మిక్కీకి ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో నాలుగేళ్ల బుడతలు మొదలుకుని నాలుగు పదుల పెద్దల వరకూ ఉన్నారంటే దీని శక్తి ఏ పాటిదనేది తెలిసివస్తుంది. కార్టూన్లకు ప్రాణప్రతిష్ట చేసిన మిక్కీమౌస్ బర్త్‌డే వేడుకలు భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలుదేశాలలో ఉత్సాహంగా జరిగాయి. మొట్టమొదటి తొలి ప్రదర్శనకు స్టీమ్‌బోట్ వీల్లీ వేదిక అయింది.

వాల్ట్‌డిస్నీ అంతకు ముందటి కార్టూన్ పాత్ర లక్కీ రాబిట్ ఓస్వాల్డ్‌పై ఉన్న హక్కులను కోల్పొవడంతో మిక్కీమౌస్ రంగ ప్రవేశం జరిగింది. నిజానికి మిక్కీ మౌస్ తొలి ఎపిసోడ్‌ల దశలో దీని నిర్మాత, క్యారికేచరిస్టు వాల్ట్ డిస్నీనే దీనికి గొంతుక సమకూర్చారు. గత 90 ఏళ్లుగా మిక్కీమౌస్ ప్రపంచవ్యాప్తంగా కాదనలేని పరిణామంగా మారింది. ఇందులోని పాత్రకు ప్రజలంతా పట్టం కట్టారు. గుండెల్లో స్థానం పదిలం చేసుకున్నారు. ఈ సార్వత్రిక విశ్వవ్యాప్త అభిమానం, భావోద్వేగపు అనుసంధానం అన్ని తరాల వారిని ప్రపంచవ్యాప్తంగా విచిత్రంగా ఏకీకృత మానసిక స్థితికి తెచ్చింది. ఇటువంటి ప్రభావిత పాత్ర మరొకటి లేదని, దీనికున్న ఫ్యాన్స్ బలంతో ఈ విషయం ధీమాగా చెపుతున్నామని డిస్నీ ఇండియా మీడియా నెట్‌వర్క్ కార్యనిర్వాహక సంచాలకులు రవీంద్రన్ ఆచారియా తెలిపారు.

భాషతో, దేశం, యాస, మతం కులం, లింగభేదం అన్నింటికి మించి వయోభేదం లేకుండా అన్ని కుటుంబాలను ఒక్కటి చేసే పాత్రగా మిక్కీమౌస్ నిలిచింది. తొంభై ఏళ్లలో ప్రపంచం కళ్లు చెదిరిపొయ్యేలా మారి ఉండొచ్చు కానీ ఈ మార్పుల ప్రభావానికి అతీతంగా నిలిచిన వేదిక ఇదే అని తేల్చిచెప్పారు. పాత్రలోని ఇతివృత్తంలోనే బలం ఉంది. ప్రధాన పాత్ర ఆశావాదిగా, సరదాగా, కుటుంబప్రేమికంగా, కట్టుబాట్లను ధిక్కరించని విధంగా ఉండటం, ప్రతి ఒక్కరి కలలలోని తీపిదనాన్ని పంచిపెడుతున్నట్లుగా ఉండటం ఈ పాత్రలో అంతర్లీనంగా కన్పించడమే దీనికి పెట్టని కోటగా మారింది. ఈ ఏడాది ఆరంభంలోనే మిక్కీమౌస్ తొంభయేళ్ల సంబరాలు ఆరంభం అయ్యాయి. డిస్నీలాండ్‌లో అతి పెద్ద మౌస్ పార్టీని ఏర్పాటు చేశారు. మీ కళ్లకు కనికట్టు చేస్తూ మిక్కీ అండ్ మిన్నీల విచిత్ర పయనం సాగుతూనే ఉంటుందనే నినాదంతో ఈ వేడుకలు సాగుతున్నాయి.

ఇండియాలో మిక్కీ వేడుకలలో భాగంగా పలుచోట్ల పిల్లల కోసం పలు వేడుకలు ఏర్పాటు చేశారు. వారికి డాన్స్‌ల పోటీలు ఆటలు పాటల పోటీలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. డిస్నీ క్యారెక్టర్ల స్టయిల్‌తో ఉండే వస్తువులు ఇప్పడు పిల్లలకు పంపిణీ చేస్తున్నట్లు ఇవి ఇండియా అంతటా పాపులర్ అవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Disney Parks Celebrate 90 Years of Mickey Mouse

Telangana News

Related Stories: