కార్చిచ్చుకు అటవీశాఖదే బాధ్యత

ప్యారడైజ్ (కాలిఫోర్నియా) : కార్చిచ్చుతో పూర్తి విధ్వంసానికి గురయిన ప్యారడైజ్ ప్రాంతంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటించారు. ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంలోని ఈ పట్టణం ఇటీవలి దావాలనంతో దాదాపుగా సంపూర్ణంగా తగులబడింది. వేయి మంది వరకూ జాడతెలియకుండా పొయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. వందేళ్లలో ఎప్పుడూ రాని రీతిలో వ్యాపించిన మంటలతో దెబ్బతిన్న ప్రాంతాలలో మిగిలి ఉన్న బూడిద కుప్పల మధ్యనే ట్రంప్ నడిచారు. ఇక్కడి దారుణ […]

ప్యారడైజ్ (కాలిఫోర్నియా) : కార్చిచ్చుతో పూర్తి విధ్వంసానికి గురయిన ప్యారడైజ్ ప్రాంతంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటించారు. ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంలోని ఈ పట్టణం ఇటీవలి దావాలనంతో దాదాపుగా సంపూర్ణంగా తగులబడింది. వేయి మంది వరకూ జాడతెలియకుండా పొయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. వందేళ్లలో ఎప్పుడూ రాని రీతిలో వ్యాపించిన మంటలతో దెబ్బతిన్న ప్రాంతాలలో మిగిలి ఉన్న బూడిద కుప్పల మధ్యనే ట్రంప్ నడిచారు. ఇక్కడి దారుణ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ రాష్ట్రం పూర్తిగా తేరుకునేందుకు తాము అన్ని విధాలుగా సాయం అందిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.

అయితే ఇంతటి కార్చిచ్చు వెలువడటం, దీనిని అదుపులో పెట్టలేకపోవడానికి ముందుగా సంబంధిత అటవీశాఖాధికారులను నిందించాలి. వారి అసమర్థతకు వారిని బాధ్యులను చేయాల్సి ఉందని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. కాలిఫోర్నియా చరిత్రలో కనివిని ఎరుగని స్థాయి ఉపద్రవం సంభవించిందని, దీనికి ఫారెస్టు డిపార్ట్‌మెంట్ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చిచెప్పారు.సంభవించిన విధ్వంసం తనను కలిచివేసిందని, అత్యవసర సిబ్బంది బాగా పనిచేస్తోందని ట్రంప్ కితాబు ఇచ్చారు. ఇక్కడి కార్చిచ్చుకు రాష్ట్ర స్థాయి అధికారుల చేతకాని తనం కారణం అని ట్రంప్ గత వారం నిందించారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు అడవులను ఇష్టారాజ్యంగా మార్చుకుంటున్నారని, ఈ రాష్ట్రానికి ఆర్థిక సా యం నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించిన ట్రంప్ ఈ పర్యటనలో కొంత సంయమనం పాటించారు. స్థానిక అధికార యంత్రాంగం గురించి విమర్శలకు దిగకుండా ఉన్న ట్రంప్ అటవీశాఖాధికారుల తీరుపై మండిపడ్డారు.

ఇంత తీవ్రస్థాయి నష్టం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని ప్యారడైజ్‌లో శిథిలాలుగా మారిన మొబైల్ హోం పార్క్ వద్ద నిలబడి ఉన్నప్పుడు ట్రంప్ తెలిపారు. సియీరా నెవాడా పర్వత దిగువన ఉన్న ప్యారడైజ్ పట్టణం చుట్టూ ఉండే అటవీ ప్రాంతంలో వ్యాపించిన క్యాంప్ ఫైర్ చివరికి  ఈ ప్రాంతంలో ప్రజలకు చితిమంటలనే పేర్చింది. ఇటువంటి పరిస్థితిని మనం మరో సారి రానివ్వకూడదు, కనీసం ఊహించుకోకూడదని ట్రంప్ చెప్పారు. ఇక్కడ అత్యంత దారుణ పరిణామం జరిగింది. ఇటువంటి ఘటనలు చివరివి కావాలని ఖచ్చితంగా అనుకోవల్సి ఉంటుం ది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో సదర్న్ కాలిఫోర్నియా ప్రాంతంలో వ్యాపించిన వూల్సే మం టలలో దెబ్బతిన్న ప్రాంతాలను కూడా ట్రంప్ సందర్శించారు. హాలీవుడ్ ప్రముఖులు, అమెరికా అత్యంత సంపన్నులు ఉండే మలిబూ ఇతర ప్రాంతాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ప్రాంతంలో కార్చిచ్చు నివారణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ట్రంప్ వెంట రాష్ట్ర ప్రస్తుత  గవర్నర్ జెర్రీ బ్రౌన్,  కాబోయే గవర్నర్ గవీన్ న్యూసామ్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గవర్నరు, కాబోయే గవర్నర్ కూడా పర్యావరణ అంశాలపై ట్రంప్ పాలసీలను ఆది నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలతో దేశ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని విమర్శిస్తూ వస్తున్నారు.

Trump surveys California wildfire devastation after 76 killed

Telangana News

Related Stories: