అసమానతలకు పరిష్కారం చిన్న రాష్ట్రాలే

న్యూఢిల్లీ: రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానలత పరిష్కారానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఒక్కటే మార్గమని దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడుతున్న వివిధ సంస్థల కూటమి అయిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ (ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్) అంటోంది. మహారాష్ట్రలో విదర్భ, అసోంలో బోడోలాండ్, కర్బీ, పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, మణిపూర్‌లో కుకిలాండ్, త్రిపురలోత్రిప్రలాండ్, ఉత్తర ప్రదేశ్‌లో  పూర్వాంచల్,  యుపి, మధ్యప్రదేశ్‌లలోని ప్రాంతాలను కలిపి బుందేల్‌ఖండ్ ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ ఆయా రాష్ట్రాల్లో వివిధ సంస్థలు, […]

న్యూఢిల్లీ: రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానలత పరిష్కారానికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఒక్కటే మార్గమని దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడుతున్న వివిధ సంస్థల కూటమి అయిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ (ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్) అంటోంది. మహారాష్ట్రలో విదర్భ, అసోంలో బోడోలాండ్, కర్బీ, పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, మణిపూర్‌లో కుకిలాండ్, త్రిపురలోత్రిప్రలాండ్, ఉత్తర ప్రదేశ్‌లో  పూర్వాంచల్,  యుపి, మధ్యప్రదేశ్‌లలోని ప్రాంతాలను కలిపి బుందేల్‌ఖండ్ ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ ఆయా రాష్ట్రాల్లో వివిధ సంస్థలు, సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నీ కలిసి ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్‌గా ఏర్పడ్డాయి. ప్రతేక రాష్ట్రాల డిమాండ్లను అధికారంలో ఉన్న  పార్టీలు పట్టించుకోవడం లేదని, కేవల ఎన్నికలకు ముందు మాత్రమే  వారి డిమాండ్లను నేరవేరుస్తాం అంటూ బుజ్జగిస్తున్నాయని ఆ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునీష్ తమంగ్ ఆరోపిస్తున్నారు.

భాష. జాతి, ఆర్థిక పరమైన అంశాల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం పై ఒత్తిడి తీసుకు రావడానికి ఆందోళనను ప్రారంభించాలని గత బుధవారం జరిగిన సమావేశంలో  ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రాలను డిమాండ్ చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానలతలను తొలగించడానికి ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని తమంగ్ అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆందోళనను ఉద్ధృతం చేయడానికి  ఈ సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమ నేతలు కొత్త వ్యూహాలను కూడా రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లపై ఆలోచన చేయాలని ఈ సంస్థ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలను కోరింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పట్ల్ల  కేంద్రంలో, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీలు వ్యవహరిస్తున్న తీరును గూర్ఖాలాండ్ ఉద్యమం  మార్గదర్శకుల్లో ఒకరైన హర్ఖ బహదూర్ ఛెత్రి తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

తమ డిమాండ్ల సాధనకు గూర్ఖా ప్రజలంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా  పెద్ద రాష్ట్రాలు మాత్రమే పాలనాపరంగా నిర్వహించడం  సాధ్యమనే భావన అవాస్తవమని ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళన ప్రముఖ నాయకుల్లో ఒకరైన శ్రీనివాస్ ఖండేవాల్ వాదించారు. ఉదాహరణకు మహారాష్ట్రకన్నా ఎంతో చిన్న రాష్ట్రమైన కేరళ పాలనాపరంగాను, అభివృద్ధిలోను ఎంతో ముందుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయని, ఇప్పుడు వాటిని ఆచరణలో చూపించాలిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలని రాడోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలను తమ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తమ సంస్థ రాజ్యాంగానికి అనుగుణంగా,ప్స్రజాప్వామ్య పద్ధతిలో, అహింసామార్గంలో  ఒత్తిడి తీసుకు రావాలని ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉంటామని ఎన్‌ఎఫ్‌ఎన్‌ఎస్ కార్యదర్శి, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అయిన ప్రమోద్ బోరో స్పష్టం చేశారు.

Small States wants set up separate states

Telangana News