మూడున్నర రెట్లు పెరిగాయ్

క్యూ2లో పిఎస్‌బిల నష్టాలు రూ.14,716 కోట్లు గతేడాది ఇదే సమయంలో రూ.4,284 కోట్లే మొండి బకాయిలే కారణం పిఎన్‌బికే అత్యధిక నష్టాలు, రాణించిన ఎస్‌బిఐ న్యూఢిల్లీ: మొండి బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకు(పిఎస్‌బి)లను పీడిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201819) రెండో త్రైమాసికంలో(జూలైసెప్టెంబర్)కు గాను ప్రకటించిన ఫలితాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మూడున్నర రెట్లు పెరిగాయి. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తలు) లేదా మొండి బకాయిలు పెరగడం వల్ల ఈసారి నష్టాలు రూ.14,716.2 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక […]

క్యూ2లో పిఎస్‌బిల నష్టాలు రూ.14,716 కోట్లు
గతేడాది ఇదే సమయంలో రూ.4,284 కోట్లే
మొండి బకాయిలే కారణం
పిఎన్‌బికే అత్యధిక నష్టాలు, రాణించిన ఎస్‌బిఐ

న్యూఢిల్లీ: మొండి బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకు(పిఎస్‌బి)లను పీడిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (201819) రెండో త్రైమాసికంలో(జూలైసెప్టెంబర్)కు గాను ప్రకటించిన ఫలితాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మూడున్నర రెట్లు పెరిగాయి. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తలు) లేదా మొండి బకాయిలు పెరగడం వల్ల ఈసారి నష్టాలు రూ.14,716.2 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం(201718) సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ 21 పిఎస్‌బిల మొత్తం నష్టం రూ.4,284 కోట్లుగానే ఉంది. అంటే ఈసారి పిఎస్‌బిల నష్టాలు మూడున్నర రెట్లు పెరిగాయి. అయితే క్యూ2లో కొన్ని బ్యాంకులు మంచి పనితీరును చూపడంతో క్యూ1తో పోలిస్తే క్యూ2లో నష్టాలు కొంతమేరకు తగ్గాయి. 2018 ఏప్రిల్ జూన్(క్యూ1)లో రూ.16,614 కోట్ల నష్టాలతో పోలిస్తే ఈసారి నష్టాలు రూ.2000 కోట్ల మేరకు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొండి బకాయిలకు అత్యధికంగా కేటాయింపులు చేయడం వల్ల ఈ బ్యాంకులపై ప్రభావం పడింది.

పిఎన్‌బి నష్టం రూ.4,532 కోట్లు
ఈ బ్యాంకులు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు(పిఎన్‌బి)వే అత్యధిక నష్టాలు నమోదయ్యాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కుంభకోణంతో సతమతమవుతున్న పిఎన్‌బి క్యూ2లో రూ.4,532.35 కోట్ల నష్టాలను ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో ఈ బ్యాంక్ నష్టం రూ.560 కోట్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచడం వల్ల పిఎన్‌బి అత్యధిక నష్టాలను మూటగట్టుకుంది. సెప్టెంబర్ ముగింపునాటి రెండో త్రైమాసికంలో మొండి బకాయిలకు రూ.9,757 కోట్లు కేటాయింపులు పెంచగా, గతేడాది ఇదే సమయంలో ఈ కేటాయింపులు రూ.2,440 కోట్లుగానే ఉన్నాయి. నీరవ్ మోడీ ఎల్‌ఒయు(లెటర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్) పేరిట రూ.14 వేల కోట్ల మేరకు మోసాలకు పాల్పడడంతో దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ పిఎన్‌బికి భారీ నష్టాలు తప్పలేదు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు బ్యాంక్ కేటాయింపులు పెంచుతోంది.

ఐడిబిఐ బ్యాంక్ నష్టం రూ.3,602 కోట్లు
పిఎన్‌బిఐ తర్వాత ఐడిబిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అత్యధిక నష్టాలను మిగిల్చింది. సెప్టెంబర్ ముగింపునాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ఐడిబిఐ బ్యాంక్ నికర నష్టం రూ.3,602 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే సమయం లో ఐడిబిఐ బ్యాంక్ నష్టం రూ.197 కోట్లు మాత్రమే ఉంది. ఇక అలహాబాద్ బ్యాంక్ రూ.1822 కోట్ల నష్టాలను ప్రకటించగా, గతేడాది నష్టం రూ.70.2 కోట్లుగా ఉంది.

బ్యాంకులకు మూలధన నిధి
అయితే 2018 మార్చి ముగింపునాటి త్రైమాసికంలో 21 బ్యాంకుల మొత్తం నష్టం రూ.62,681 కోట్లుగా ఉంది. రుణ భారంతో సతమతమవుతున్న ఈ బ్యాంక్‌ల పనితీరు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్)లు చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఈ బ్యాంకులకు మూలధన నిధిని ప్రకటించింది. మరోవైపు ఆర్‌బిఐ బ్యాంకులపై నిఘా మరింతగా పెంచి కఠిన చర్యలు చేపట్టింది.

నష్టాలను తగ్గించిన ఎస్‌బిఐ, ఒబిసి
మొత్తం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బాగా రాణించింది. మొత్తం పిఎస్‌బిల నష్టాలను తగ్గించడంలో ఎస్‌బిఐ వాటా కొంతమేరకు దోహదం చేసింది. ఆ తర్వాత ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఒబిసి) కూడా మెరుగైన ఫలితాలను ప్రకటించింది. 2018 క్యూ1(ఏప్రిల్‌జూన్)లో రూ.4,875 కోట్ల నష్టాలను ప్రకటించిన ఎస్‌బిఐ.. క్యూ2(జూలైసెప్టెంబర్)లో రూ.944 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నికర లాభం రూ.101 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఈ బ్యాంక్ నికర నష్టం రూ.393 కోట్లు ఉండడం గమనార్హం.

Public sector banks losses rise 3.5 times higher in Q2

Telangana Latest News

Related Stories: