‘సాహో’ విడుదల వాయిదా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు సుజిత్‌ల కాంబినేషన్‌లో యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. అత్యంత భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో వస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం వేసవిలో రావడం లేదని తెలిసింది. ‘సాహో’ చిత్రం విడుదల తేదీలో మార్పు చేస్తున్నారట. మొదట ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో  రిలీజ్ చేయాలనుకున్న మాట వాస్తవమే.  […]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు సుజిత్‌ల కాంబినేషన్‌లో యువి క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. అత్యంత భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో వస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం వేసవిలో రావడం లేదని తెలిసింది. ‘సాహో’ చిత్రం విడుదల తేదీలో మార్పు చేస్తున్నారట. మొదట ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో  రిలీజ్ చేయాలనుకున్న మాట వాస్తవమే.  కానీ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్, సమ్మర్ సీజన్ పోటీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మూడు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిల్మ్‌మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం వల్ల లాభం పొందాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. హడావుడిగా కాకుండా కాస్త నిదానంగానే సినిమాను విడుదల చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి ప్రమోషన్ చేసి పెద్ద బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారట. మరోవైపు ప్రభాస్, రాధాకృష్ణల కాంబినేషన్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది.

Sahoo Movie Release Date Postponed 

Telangana News

Related Stories: