పాటల పల్లకిలో ‘తెలంగాణ దేవుడు’

మ్యాక్ ల్యాబ్స్ ప్రై.లి. బ్యానర్‌పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ “దర్శకుడు హరీష్ చెప్పిన సబ్జెక్ట్‌లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను ఆయన చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో నటించడంతో గర్వంగా ఉంది. అద్భుతమైన […]

మ్యాక్ ల్యాబ్స్ ప్రై.లి. బ్యానర్‌పై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ “దర్శకుడు హరీష్ చెప్పిన సబ్జెక్ట్‌లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ను ఆయన చాలా బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో నటించడంతో గర్వంగా ఉంది. అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు నందన్ రాజు బొబ్బిలి. ఈ సినిమా కోసం మేమంతా ఒక కుటుంబంలాగా కలిసి పనిచేశాం. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. సంగీత మాట్లాడుతూ “శ్రీకాంత్‌తో కలిసి నేను ఐదు చిత్రాల్లో నటించాను. జిషాన్ హ్యాండ్‌సమ్ హీరో. సినిమాటోగ్రాఫర్ విజయ్‌తో ఇది నా మూడవ చిత్రం. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను”అని చెప్పారు. దర్శకుడు హరీష్ వడ్‌త్యా మాట్లాడుతూ “నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత నాకు దేవుడు. నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించారు. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్, జిషాన్ ఉస్మాని, నందన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Devudu Movie Audio Released 

Telangana News

Related Stories: