మహారాణిలా కళకళలాడుతోంది

టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణిగా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. ఆదివారం నయన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సైరా’ టీమ్ ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సైరా’లో నయనతార ‘సిద్ధమ్మ’ […]

టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సతీమణిగా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. ఆదివారం నయన్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సైరా’ టీమ్ ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సైరా’లో నయనతార ‘సిద్ధమ్మ’ అనే పాత్ర పోషిస్తోంది. ఇక ఆమె ఫస్ట్‌లుక్ విషయానికి వస్తే పూర్తిగా ఆభరణాలతో అలంకరించుకొని మహారాణిలా దర్శనమిస్తోంది. కమ్మలు, ముక్కు పుడకలు, పాపిడి బిళ్ల, మెడలో హారం ఇలా ఒకటేమిటి అన్ని రకాల ఆభరణాలతో నయనతార కళకళలాడుతోంది. పైట చెంగును తలపై కప్పుకొని ఉంది. మొత్తానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సరైన జోడీలా నయనతార కనబడుతోంది. భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిలిం కావడంతో ఫిల్మ్‌మేకర్స్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవితో సహా ఇతర ప్రధాన పాత్రధారుల కాస్టూమ్స్, మేకప్ విషయంలో వీలైనంత సహజంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. నయనతార లుక్ చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

Nayantara First Look of Sye Raa Movie Released 

Telangana News

Related Stories: