బయోపిక్‌లో సమంత

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో పలువురు స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని సమంత ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. సమంత ఏ రోల్‌లో నటిస్తోందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన జమున లేదా […]

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో పలువురు స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని సమంత ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. సమంత ఏ రోల్‌లో నటిస్తోందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన జమున లేదా కాంచన పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

Actress Samantha joined in NTR Biopic 

Telangana News