కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్

కె.వి. ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎం.వరప్రసాద్ దర్శకత్వంలో జి.ఎం.మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సమయం లేదు మిత్రమా’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది. పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నోయల్, ట్వింకిల్ సౌజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ “క్యాచీగా ఉండే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. విలన్‌గా నగేష్ ఈ చిత్రంలో తన విశ్వరూపం చూపించబోతున్నారు”అని అన్నారు. నిర్మాత జి.ఎం.మురళీధర్ మాట్లాడుతూ […]

కె.వి. ప్రొడక్షన్ బ్యానర్‌లో ఎం.వరప్రసాద్ దర్శకత్వంలో జి.ఎం.మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సమయం లేదు మిత్రమా’. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగింది. పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నోయల్, ట్వింకిల్ సౌజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.వరప్రసాద్ మాట్లాడుతూ “క్యాచీగా ఉండే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. విలన్‌గా నగేష్ ఈ చిత్రంలో తన విశ్వరూపం చూపించబోతున్నారు”అని అన్నారు. నిర్మాత జి.ఎం.మురళీధర్ మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. దర్శకుడు వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాను”అని తెలిపారు. నోయల్ మాట్లాడుతూ “టైటిల్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. ఇందులో నేను చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. పాటలు చాలా బాగున్నాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగేష్, మాంచాల కిషన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః ప్రవీణ్ కె.కావళి, సంగీతంః అజయ్ పట్నాయక్, ఆర్ట్‌ః ఆనంద్, ఎడిటర్‌ః ఉపేంద్ర, డైలాగ్స్‌ః కోలా నవీన్.

Comedy Action Entertainer Movie Samayam Ledu Mithrama 

Telangana News

Related Stories: