పండంటి పాపకు జన్మనిచ్చిన నేహా

బాలీవుడ్ హీరోయిన్ నేహా దుపియా మే నెలలో తన బాయ్‌ఫ్రెండ్ అంగద్ బేడీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేహా గర్భం దాల్చిన కారణంగా హడావుడిగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆగస్టులో తాను గర్భవతినని నేహా ప్రకటించింది. ఇక నేహా దుపియా ఆదివారం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో ఆమెకు డెలివరీ జరిగిందని… తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ఇక నేహా పండంటి పాపకు జన్మనివ్వడంతో అంగద్ […]

బాలీవుడ్ హీరోయిన్ నేహా దుపియా మే నెలలో తన బాయ్‌ఫ్రెండ్ అంగద్ బేడీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేహా గర్భం దాల్చిన కారణంగా హడావుడిగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆగస్టులో తాను గర్భవతినని నేహా ప్రకటించింది. ఇక నేహా దుపియా ఆదివారం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో ఆమెకు డెలివరీ జరిగిందని… తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ఇక నేహా పండంటి పాపకు జన్మనివ్వడంతో అంగద్ బేడీ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ సందర్భంగా నేహా, అంగద్‌లకు పలువురు బాలీవుడ్ నటీనటులు శుభాకాంక్షలు తెలియజేశారు

Neha Dhupia and Anand Blessed with Baby Girl 

Telangana News