ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో..

ధనుంజయ, ఇర్రామోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారైంది. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషలలో ఈనెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకు రవిశంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అభిషేక్ […]

ధనుంజయ, ఇర్రామోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారైంది. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషలలో ఈనెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకు రవిశంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జగదీస్ చీకటి, కథ, స్క్రీన్‌ప్లేః రామ్‌గోపాల్‌వర్మ, రామ్ వంశీకృష్ణ.

Bhairava Geetha Movie With Faction Backdrop 

Telangana News