అమృత్‌సర్‌లో గ్రెనేడ్ దాడి

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో దుండగులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 15 మంది గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అడ్లివాల్  గ్రామంలో నిరంకారీ శాఖకు చెందిన సిక్కులు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుందన్నారు.  టర్బన్లు ధరించి  బైక్‌పై వచ్చిన సాయుధులైన ఇద్దరు దుండగులు ఆధ్యాత్మిక సమావేశం వైవు దూసుకొచ్చి గ్రెనేడ్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. గాయ పడ్డవారిని వెంటనే గురు నానక్‌దేవ్ ఆస్పత్రి, ఐవి ఆస్పత్రులకు తరలించామన్నారు. […]

అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో దుండగులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా దాదాపు 15 మంది గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అడ్లివాల్  గ్రామంలో నిరంకారీ శాఖకు చెందిన సిక్కులు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుందన్నారు.  టర్బన్లు ధరించి  బైక్‌పై వచ్చిన సాయుధులైన ఇద్దరు దుండగులు ఆధ్యాత్మిక సమావేశం వైవు దూసుకొచ్చి గ్రెనేడ్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. గాయ పడ్డవారిని వెంటనే గురు నానక్‌దేవ్ ఆస్పత్రి, ఐవి ఆస్పత్రులకు తరలించామన్నారు. సమూహాన్ని లక్షంగా చేసుకుని దాడి చేయడాన్ని బట్టి  ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నట్లు పంజాబ్ డిజిపి సురేశ్ అరోరా మీడియాకు తెలిపారు. ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో ఆరు నుంచి ఏడుగురు జేషే మహ్మద్ ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైనట్లు ఘటన స్థలానికి చేరుకున్న ఐజిపి ఎస్‌ఎస్ పర్మార్  విలేకరులకు తెలిపారు. ఘటన జరిగినప్పుడు లోపల 200 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. ప్రాంగణంలో సిసి కెమెరాలు లేవని ఆయన పేర్కొన్నారు. దాడిని ఖండించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మృతు ల కుటుంబాలకు  సానుభూతిని తెలియ జేశా రు.  గ్రెనేడ్ దాడికి పాల్పడిన వారిపై  కఠిన చర్య లు తీసుకుంటామని ఆయన  శపథం చేశారు.

 Grenade attack in Amritsar district

Telangana News

Related Stories: