ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయిన సంఘటన షోపియాన్ జిల్లాలోని రెబ్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  మృతి చెందిన ఉగ్రవాదులను నవాజ్ అహ్మద్ వాగే, యవార్ వనిలుగా గుర్తించామని భద్రతా అధికారులు తెలిపారు. […]

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయిన సంఘటన షోపియాన్ జిల్లాలోని రెబ్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  మృతి చెందిన ఉగ్రవాదులను నవాజ్ అహ్మద్ వాగే, యవార్ వనిలుగా గుర్తించామని భద్రతా అధికారులు తెలిపారు. అల్-బదార్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఉగ్రవాద సాహిత్యం, తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్న కశ్మీర్ మహిళ షాజియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాలంటూ ఫేస్‌బుక్ ద్వారా ఆమె యువకులను ప్రోత్సహిస్తున్నదని పోలీసులు చెప్పారు. ఆమె ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించిన అనంతరం బందీపుర జిల్లాలో అరెస్టు చేశామని తెలిపారు.

two Terrorist Killed In encounter at Jammu Kashmir

Telangana News