పిడుగు పాటు పడి రైతు మృతి

మహబూబాబాద్ :  పిడుగుపడి రైతు మృతి చెందిన సంఘటనా జిల్లాలోని కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో చోటు చేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన బానోత్ లచ్చు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు వారి పనిలో భాగంగా ఆదివారం పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పాటు పిడుగు పడడంతో లచ్చు సంఘటన స్థలంలోనే […]

మహబూబాబాద్ :  పిడుగుపడి రైతు మృతి చెందిన సంఘటనా జిల్లాలోని కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో చోటు చేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామానికి చెందిన బానోత్ లచ్చు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు వారి పనిలో భాగంగా ఆదివారం పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పాటు పిడుగు పడడంతో లచ్చు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య రాంకూ, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తాహేర్‌బాబా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం గూడూరు  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Farmer Died After Thunder Fall in Mahabubabad District

Telangana News