పచ్చబొట్టుతో ప్రాణహాని

ఫ్యాషన్ ప్రపంచంలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలనో.. లేదంటే ఇష్టమైన వారి పట్ల ప్రేమను చూపించాలనో చాలా మంది శరీరంపై పచ్చ బొట్టు వేయించుకుంటున్నారు. చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా ఎక్కడపడితే అక్కడ రంగు రంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు. ఇలాంటి వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటూ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని జోడించి శరీరంపై మెరుపులు మెరిపించేందుకు లేజర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందే. అయితే ఈ ఆనందం ప్రాణాలను కూడా తీస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. […]

ఫ్యాషన్ ప్రపంచంలో అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలనో.. లేదంటే ఇష్టమైన వారి పట్ల ప్రేమను చూపించాలనో చాలా మంది శరీరంపై పచ్చ బొట్టు వేయించుకుంటున్నారు. చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా ఎక్కడపడితే అక్కడ రంగు రంగుల పచ్చబొట్లను వేయించుకుని మురిసిపోతున్నారు. ఇలాంటి వారి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటూ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని జోడించి శరీరంపై మెరుపులు మెరిపించేందుకు లేజర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందే. అయితే ఈ ఆనందం ప్రాణాలను కూడా తీస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు పచ్చబొట్లపై పరిశోధనలు చేయగా, దీనిలో పచ్చబొట్లు వేసేందుకు ఉపయోగించే సూదుల వల్ల ప్రాణాంతకమైన హెపటైటిస్- బీ, సీ కాలేయ జబ్బులు వస్తాయట..ఒకరికి వాడిన సూదులను శుభ్రం చేయకుండా మరొకరికి ఉపయోగిస్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయని తెలిపింది. అలాగే పచ్చ బొట్టు వేయడానికి ఉపయోగించే ఇంక్‌లో మెర్క్యూరీ వంటి మెటల్స్ ఉండటం వల్ల అది రేడియేషన్‌కు రియాక్ట్ అవుతుందని.. దీని వల్ల ఎలర్జీ, వాపులు వస్తాయని పరిశోధనలో తేలింది. హెపటైటిస్ వైరస్ శరీరంలో చేరిన చాలా కాలం వరకు దాని ప్రభావాన్ని గుర్తించలేరని.. తద్వారా రక్తంలో ఇన్‌ఫెక్షన్ చేరి మరణం వరకూ వెళ్లే ప్రమాదముందని చెబుతున్నారు.

Research has revealed that tattoo on body takes life

Telangana Latest News