మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలింది. ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. సుక్మా జిల్లా ఎస్పి అభిషేక్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాండ్‌మడుగు తాలూకాలో డిఆర్జి భద్రతా బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో జవాన్లు అనుకోకుండా ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పై కాలువేయగా విస్ఫోటనం జరిగింది. ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తోటి జవాన్లు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం […]

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలింది. ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. సుక్మా జిల్లా ఎస్పి అభిషేక్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాండ్‌మడుగు తాలూకాలో డిఆర్జి భద్రతా బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో జవాన్లు అనుకోకుండా ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పై కాలువేయగా విస్ఫోటనం జరిగింది. ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తోటి జవాన్లు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు.గాయపడిన వారిలో జవాను పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కి తరలించినట్లు ఎస్పి తెలిపారు.

Two Soldiers Injured In Landmine Blast in Chattishgarh

Telangana News

Related Stories: