నయన్‌ బర్త్ డే.. ప్రియుడి సర్‌ప్రైజ్‌ అదిరింది

చెన్నై: స్టార్ హీరోయిన్ నయనతారను ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివాన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ అందాల భామ  ఆదివారం తన 34వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విఘ్నేశ్‌ తన అందాల ప్రేయసి కోసం ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు. ఇందులో ఫిల్మ్ థీమ్‌తో కేక్‌పై నయన్ ఫోటో ఉంచి.. క్లాప్ బోర్డ్‌పై ‘హ్యాపీ బర్త్ డే నయనతార అనే అక్షరాలతో పాటు పుట్టిన తేదీని కూడా ఉంచారు. మరోవైపు కెమెరా, నాలుగు స్టార్లు […]

చెన్నై: స్టార్ హీరోయిన్ నయనతారను ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివాన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ అందాల భామ  ఆదివారం తన 34వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విఘ్నేశ్‌ తన అందాల ప్రేయసి కోసం ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు. ఇందులో ఫిల్మ్ థీమ్‌తో కేక్‌పై నయన్ ఫోటో ఉంచి.. క్లాప్ బోర్డ్‌పై ‘హ్యాపీ బర్త్ డే నయనతార అనే అక్షరాలతో పాటు పుట్టిన తేదీని కూడా ఉంచారు. మరోవైపు కెమెరా, నాలుగు స్టార్లు ఉంచి బ్యాగ్రౌైండ్‌లో విద్యుత్ దీపాల అలంకరణతో ఫోటోకి సూపర్బ్ లుక్ ఇచ్చాడు. ఇంటి పరిసరాల్నికూడా బెలూన్లు, విద్యుత్‌ దీపాలు, పూలతో నింపాడు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్ననయన్, విఘ్నేశ్‌ కలిసి పలు పార్టీలు, విహారయాత్రలకు వెళ్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం నయన్‌ తెలుగులో మెగాస్టార్ చిరుకు జోడీగా ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Heroine Nayanatara 34th birthday celebrations

Related Stories: