ఆర్ టిసి బస్సు ఢీకొని దంపతులు మృతి

మేడ్చల్: జిల్లాలోని మేడిపల్లి మండలం నారపల్లి వద్ద ఆర్ టిసి బస్సు బీభత్సం సృష్టించింది. డివైడర్ దాటి అవతలి వైపు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దంపతులు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతులు కోటేశ్వరరావు(29), స్వప్న(27)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి […]

మేడ్చల్: జిల్లాలోని మేడిపల్లి మండలం నారపల్లి వద్ద ఆర్ టిసి బస్సు బీభత్సం సృష్టించింది. డివైడర్ దాటి అవతలి వైపు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దంపతులు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతులు కోటేశ్వరరావు(29), స్వప్న(27)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Couple Dies In Road Accident At Narapalli Medchal District

Telangana News

Related Stories: