సైదిరెడ్డి గెలుపు హుజూర్‌నగర్ అభివృద్దికి మలుపు

హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్దే టిఆర్‌ఎస్‌ను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తుందని హుజూర్‌నగర్ ఎంఎల్‌ఏ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి గెలుపు నియోజకవర్గ అభివృద్దికి మలుపు అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని స్వర్ణవేధిక ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ టిఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంఘించారు. అభివృద్దిలో భారతదేశంలోనే నంబర్‌వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్న ఘనత ఒక్క తెలంగాణకే దక్కిందని, ఆ ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని […]


హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్దే టిఆర్‌ఎస్‌ను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తుందని హుజూర్‌నగర్ ఎంఎల్‌ఏ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి గెలుపు నియోజకవర్గ అభివృద్దికి మలుపు అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని స్వర్ణవేధిక ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ టిఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంఘించారు. అభివృద్దిలో భారతదేశంలోనే నంబర్‌వన్ స్ధానాన్ని కైవసం చేసుకున్న ఘనత ఒక్క తెలంగాణకే దక్కిందని, ఆ ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ మేనిఫెస్టో జనరంజకమైనదని, కెసిఆర్ చేసేవే చెబుతారని, చెప్పినవి కాక చెప్పనివి చేయగల సత్తా కలిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనన్నారు. మహాకూటమి పేరుతో మాయగాళ్ళంతా జట్టుకట్టారని, వాళ్ళది మహాకూటమి కాదు మహావిషకూటమని ఎద్దేవా చేశారు.

ప్రజల రక్తం పీల్చేందుకే వారంతా ఏకమై ఎన్నికలల్లో పోటీ చేస్తున్నారన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు వారిని ఓటు ద్వారా తరిమికొట్టేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఉత్తమ్‌తో నియోజకవర్గానికి ఓరిగిందేమీలేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు హుజూర్‌నగర్ నియోజకవర్గం ఎటువంటి అభివృద్దికి నోచుకోకుండా ఉండటానికి ప్రధాన కారకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డేనని ఆరోపంచారు. ఎంఎల్‌ఏగా, మంత్రిగా ఉండి కూడా హుజూర్‌నగర్‌కు చేసిందేమీలేదని, అభివృద్ది ముసుగులో వందల కోట్ల అక్రమ ఆస్తులను కూటబెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. గత నాలుగున్నార సంవత్సరాలుగా నియోజకవర్గానికి సుమారు 25 సార్లు మాత్రమే వచ్చారని, అదికూడా పెండ్లీలకు, పేరంటాలకే కానీ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాదని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతానని ఆయననే మళ్ళీ మెజార్టీతో గెలిపించాలని కోరడం హాస్యాస్పదమన్నారు.

ఉత్తమ్‌ను నమ్మి ఓట్లు వేసే పరిస్ధితిలో నియోజకవర్గ ప్రజలు లేరని, ఉత్తమ్ గెలవడం ఒక కల గానే మిగులుతుందని జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుపు నల్లేరుపైన నడకేనని దీమా వ్యక్తం చేశారు. నేడు హుజూర్‌నగర్ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ అభ్యర్ధిగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్న శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గం నుండి టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సుమారు 30వేల మందికి పైనే తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసందోహం నడుమ గులాభి జెండా రెపరెపలాడాలని కోరారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి లింగయ్య యాదవ్ గులాభీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ జక్కుల వెంకయ్య యాదవ్, మాజీ యంపిపి నర్సింగ్ వెంకటేశ్వర్లుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కస్తాల కోటమ్మ రామయ్య,చెవుల కవిత, ఉప్పాల విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Shanampudi Saidireddy Speech At Huzurnagar Trs Meeting

Telangana News