డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయి ఔట్!

చెన్నై:ప్రముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, సింగ‌ర్ చిన్మ‌యిని తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పిస్తూ త‌మిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా ఆదేశాలు జారీచేశారు.దీనిపై చిన్మయి స్పందిస్తూ…నేను రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్‌ కట్టడంలేదని నన్నుయూనియన్‌ నుంచి తొలగించారు…మ‌రి డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తే గత రెండేళ్లుగా డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. తమిళ చిత్ర పరిశ్రమ నిబంధనల ప్రకారం డబ్బింగ్‌ యూనియన్‌లో సభ్యత్వం లేకపోతే వారు మనల్ని పని చెయ్యనివ్వరని, నేను […]

చెన్నై:ప్రముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌, సింగ‌ర్ చిన్మ‌యిని తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి తప్పిస్తూ త‌మిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాజా ఆదేశాలు జారీచేశారు.దీనిపై చిన్మయి స్పందిస్తూ…నేను రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్‌ కట్టడంలేదని నన్నుయూనియన్‌ నుంచి తొలగించారు…మ‌రి డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగిస్తే గత రెండేళ్లుగా డబ్బింగ్ ఫీజు నుంచి 10 శాతం మొత్తాన్ని అసోసియేషన్ ఎందుకు తీసుకుందని ప్రశ్నించింది. తమిళ చిత్ర పరిశ్రమ నిబంధనల ప్రకారం డబ్బింగ్‌ యూనియన్‌లో సభ్యత్వం లేకపోతే వారు మనల్ని పని చెయ్యనివ్వరని, నేను రెండేళ్లుగా సభ్యత్వ ఫీజ్‌ కట్టడంలేదని వారు నాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని చిన్మయి పేర్కొంది. ప్ర‌స్తుతం తాను అమెరికాలో ఉన్నానని, ఈ స‌మ‌యంలో  ఎలాంటి రాత పూర్వ‌క వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌లేనని చెప్పింది. నాపై వేటు కొనసాగితే, ఇటీవలి ’96’ చిత్రంలో త్రిషకు తాను చెప్పిన డబ్బింగ్ చివరిది అవుతుందని చిన్మయి ట్వీట్ చేసింది.

దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ప్ర‌ముఖ పత్రిక‌ని చిన్మ‌యి కోరింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చిన్మయిపై తీసుకున్న ఈ చ‌ర్య‌ల‌ని త‌ప్పు ప‌డుతున్నారు.ఇక, ఇటీవల ప్ర‌ముఖ ర‌చ‌యిత వైర‌ముత్తుతో పాటు లైంగికంగా వేధించిన ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లను చిన్మయి బ‌హిర్గ‌తం చేసిన విషయం తెలిసిందే.

chinmayi removed from tamil dubbing union

Related Stories: