ఉన్నత విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలి

అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో క్రియా వర్శిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచ అత్యుత్తమ వర్శిటీలతో పోలిస్తే దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ వెనుకబడి ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాల మేరకు దేశంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలని పిలుపు నిచ్చారు. ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేలా నాణ్యమైన విద్య అందించాలన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో సమన్వయం అవసరమని, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించే బలమైన […]

అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో క్రియా వర్శిటీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ఆన్ లైన్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచ అత్యుత్తమ వర్శిటీలతో పోలిస్తే దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ వెనుకబడి ఉందన్నారు. 21వ శతాబ్దపు అవసరాల మేరకు దేశంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించాలని పిలుపు నిచ్చారు. ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేలా నాణ్యమైన విద్య అందించాలన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో సమన్వయం అవసరమని, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించే బలమైన పాత్ర పోషించాలని సూచించారు.

ఆవిష్కరణలు లేకుండా అభివృద్ధిలో ముందుకు సాగలేమని, విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణలకు కేంద్రాలు కావాలని ఆకాంక్షించారు. కోపం, నిరాశ, వివక్ష వంటి వాటికి విశ్వవిద్యాలయాల్లో స్థానం ఉండకూడదని తెలిపారు. వర్శిటీలు ఙ్ఞానం, వివేకం, విఙ్ఞానాలను సంరక్షించే ప్రదేశాలుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘క్రియా’ లాంటి విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వేగంగా పురోగతి సాధిస్తున్నాయని వెంకయ్య నాయుడు అన్నారు.

Venkaiah naidu starts to Kriya University from Delhi

Related Stories: